June 07 Horoscope | అరుదైన యోగాల కలయిక.. ఈ రాశుల వారికి అన్ని శుభ ఫలితాలే!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: June 07 Horoscope | జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నేడు (ఆదివారం, జూన్​ 07) చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు సూర్యుడు వృషభరాశిలో సంచారం చేయనున్నాడు.

మరోవైపు మిథున రాశిలో బుధుడు, శుక్ర గ్రహాల కలయికతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. అంతేకాదు కుంభ రాశిలో చంద్రుడు, రాహువు కలయికతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి.

మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే విషయాలను తెలుసుకుందాం.

June 07 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: చంద్రుడు పదకొండో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీకు ఊహించని ఆర్థిక లాభాలొచ్చే అవకాశాలున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ ముఖ్యమైన కోరికలలో ఒకటి నెరవేరే అవకాశం ఉంది.

వృషభ రాశి: June 07 Horoscope | ఇవాళ వీరికి సూర్యుడి అనుగ్రహంతో మనోధైర్యం పెరిగే అవకాశం ఉంది. బుధ, శుక్ర గ్రహాల కలయికతో అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి.

తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించొచ్చు. పిల్లల ద్వారా సంతోషాన్ని పొందుతారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి: June 07 Horoscope | ఇవాళ మీకు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి.పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది.

వ్యాపారులకు మెరుగైన లాభాలు వస్తాయి. ఆదాయం భారీగా పెరగనుంది . కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపుతారు. పాత పెట్టుబడుల నుంచి భారీ లాభాలు పొందే అవకాశాలున్నాయి.

కర్కాటక రాశి: June 07 Horoscope | వీరికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. రాహువు, చంద్రుడి కలయిక వల్ల కొంత ప్రతికూలంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడొచ్చు. గురు గ్రహం ప్రభావంతో ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ పెద్దల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి.

సింహ రాశి: ఇవాళ మీకు సమాజంలో గౌరవం పెరిగే అవకాశాలున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కోరికలు నెరవేరొచ్చు. తండ్రి నుంచి ఆశించిన మద్దతు లభిస్తుంది.

మతపరమైన, ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు చేసే ప్రయాణాల వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి. ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం ఉంటే, సంయమనం పాటించాలి.

కన్యా రాశి: బుధుడు, శుక్రుడి కలయిక కారణంగా ఆర్థిక పరంగా అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. మీ అంచనాలకు మించి లాభాలొచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందొచ్చు.

తులా రాశి: మీకు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఆస్తికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. వీటి నుండి మంచి లాభాలు పొందుతారు.

మీరు చేసే ప్రయాణాల్లో శుభ ఫలితాలు రానున్నాయి. కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది. ఇవాళ మీరు కొత్త వాహనం లేదా ఆస్తి కొనేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చిక రాశి: ఇవాళ మీరు కొన్ని శుభ వార్తలు వింటారు. గురు గ్రహం ప్రభావంతో వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. బంధువులు, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. కొన్ని సంతోషకరమైన శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు రాశి: ఇవాళ చాలా ఉత్సాహంగా ఉంటారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, కొత్త పనులు చేయడానికి ఒక అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం లేదా ప్రయాణానికి సంబంధించిన ఖర్చులు పెరగొచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

మకర రాశి: ఇవాళ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందొచ్చు. ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి.

కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తెలివితేటలతో క్లిష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉంది.

కుంభ రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందుతారు. మీ సన్నిహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

ఆదాయం, ఐశ్వర్యం పెరిగే సూచనలు ఉన్నాయి. పెండింగులో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. స్నేహితుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది.

మీన రాశి: June 07 Horoscope | మీకు ప్రత్యేకంగా ఉంటుంది. ల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. పనికి సంబంధించిన చేసే ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీరు చేసే పనులన్నింట్లో శుభ ఫలితాలు పొందుతారు.

సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ పెండింగ్ పనులన్నీసకాలంలో పూర్తి చేయొచ్చు. కుటుంబంతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రానికి ప్రయాణించే అవకాశం ఉంది.

Varalakshmi Controversial Comments | మగాడు కేవలం ‘స్పేర్ పార్ట్’ మాత్రమేనా?…

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *