Pawan Kalyan Fan | అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానిని పరామర్శించిన పవన్​

అరుధైన వ్యాధితో మంచానికే పరిమితం అయిన అభిమానిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ పరామర్శించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pawan Kalyan Fan | అరుదైన వ్యాధితో బాధ పడుతున్న చిన్నారి అభిమానిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Deputy CM Pawan Kalyan) పరామర్శించారు. హన్మకొండలోని హనుమాన్​ నగర్​కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ జన్యు పరమైన వ్యాధితో మంచానికే పరిమితం అయ్యాడు.

నిరంజన్​ పవన్​ అభిమాని. తన చివరి కోరికగా పవన్ కల్యాణ్​ను కలవాలని కోరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ బుధవారం హన్మకొండకు వచ్చారు. నిరంజన్​ ఇంటికి వెళ్లి కలిశారు. తన అభిమాన నటుడిని కలవడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Pawan Kalyan Fan | ధైర్యంగా ఉండాలి

తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని భగవంతుడి ఆశీస్సులు బాబుకి ఉంటాయని చెప్పి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం నింపారు. వేంకటేశ్వరస్వామి తీర్థ ప్రసాదాలు అందించారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్ధిక సాయం అందజేశారు. నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్​ను అనుకరిస్తూ చేసిన డ్యాన్సుల తాలూకు వీడియోలు, ఫొటోలను తిలకించారు. అంతా తనని చోటా గబ్బర్ సింగ్ అని పిలుస్తారని నిరంజన్ చెప్పాడు.

Pawan Kalyan Fan | కుటుంబ జీవనోపాధికి క్యాంటీన్

నిరంజన్ ఓ కుక్క పిల్ల బొమ్మ చూపి పెంచుకోవాలని ఉందని చెప్పగా, కొని పంపుతానని హామీ ఇచ్చారు. కుక్కను పెంచుకోవడానికి ఇంటి ఓనర్స్ అనుమతి కావాలని నిరంజన్ తండ్రి చెప్పగా, స్వయంగా ఆ ఇంటి ఓనర్స్​తో ఆయన మాట్లాడారు. గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటిన్లో పని చేసేవారమని చెప్పగా, వారి జీవనోపాధి మెరుగుపర్చేందుకు క్యాంటిన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకు ఆయన సూచించారు. నిరంజన్​ను పరామర్శించిన అనంతరం పవన్​ వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఇది కూడా చదవండి..: Shabbir Ali Flexies | షబ్బీర్​ అలీకి మద్దతుగా గాంధీ భవన్​లో ఫ్లెక్సీలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *