అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Rains Today | వర్షాల కోసం నిత్యం ఆకాశం వైపు చూస్తున్న అన్నదాతలకు వాతావరణ శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. నేటి నుంచి తెలంగాణ (Telangana)లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఐదు రోజుల నుంచి వాతావరణం పొడిగా ఉంది. ఎండలు దంచికొట్టాయి. అయితే బుధవారం నుంచి అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ రోజు కూడా తెలంగాణ అంతటా వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగుతుంది.
Telangana Rains Today | ఆ జిల్లాల్లో..
వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నాగర్కర్నూల్, గద్వాల్, నల్గొండ, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అయితే ఇవి విస్తారమైన వానలు కావు. దీంతో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కురుస్తాయి. గురువారం నుంచి వర్షాలు పెరగనున్నాయి.
ఇది కూడా చదవండి..: Gandhi Medical College Vice Principal | గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ బి.వి. నాగమోహన్ రావు నియామకం