Kia Syros EV | ఒక్క చార్జ్‌తో 526 కి.మీ.. కియా సైరోస్ ఈవీ ఎంట్రీ

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kia Syros EV | ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో పోటీ మరింత వేడెక్కుతున్న వేళ ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన కొత్త సైరోస్ ఈవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే గరిష్ఠంగా 526 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉండటం ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రత్యేకతగా నిలుస్తోంది.

Kia Syros EV | లైఫ్‌టైమ్ వారంటీ..

వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంచేలా ఈ మోడల్‌లోని బ్యాటరీపై లైఫ్‌టైమ్ LIFE TIME వారంటీ ప్రకటించడం మరో ఆకర్షణగా మారింది. దీంతో బ్యాటరీ electric battery పనితీరు, నిర్వహణ ఖర్చులపై వినియోగదారుల్లో ఉండే ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేసినట్లు కంపెనీ తెలిపింది.

Kia Syros EV | రూ.25,000తో ప్రీ-బుకింగ్..

కొత్త ఈవీని కొనుగోలు చేయాలనుకునే వారు రూ.25,000 టోకెన్ మొత్తంతో ప్రీ-బుకింగ్ PRE – BOOKING చేసుకోవచ్చు. త్వరలోనే డెలివరీలు ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్లు, ఎక్కువ డ్రైవింగ్ రేంజ్, బ్యాటరీ వారంటీ వంటి అంశాలతో కియా సైరోస్ ఈవీ భారత ఈవీ మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వనున్నట్లు ఆటోమొబైల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

KTR Revanth Comments | 76 సార్లు ఢిల్లీ వెళ్లారు.. 76 పైసలైనా తెచ్చారా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ విమర్శలు

కియా సైరోస్ ఈవీ ప్రధాన ఫీచర్లు

  • ఒక్కసారి పూర్తి చార్జ్‌తో గరిష్ఠంగా 526 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం.
  • బ్యాటరీపై లైఫ్‌టైమ్ వారంటీ, వినియోగదారులకు దీర్ఘకాలిక భరోసా.
  • ఫాస్ట్ ఛార్జింగ్: డీసీ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్‌తో తక్కువ సమయంలో బ్యాటరీ చార్జ్ అయ్యే సౌకర్యం.
  • పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్: వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్.
  • డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే: వాహన సమాచారం స్పష్టంగా చూపించే పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.
  • కనెక్టెడ్ కార్ టెక్నాలజీ: మొబైల్ యాప్ ద్వారా వాహనాన్ని ట్రాక్ చేయడం, రిమోట్ ఫీచర్ల వినియోగం.
  • వెంటిలేటెడ్ సీట్లు: ముందు సీట్లకు వెంటిలేషన్ సదుపాయం.
  • పనోరమిక్ సన్‌రూఫ్: విశాలమైన సన్‌రూఫ్‌తో ప్రీమియం అనుభూతి.
  • 360-డిగ్రీ కెమెరా: పార్కింగ్, ఇరుకైన ప్రదేశాల్లో డ్రైవింగ్‌కు సహాయం.
  • లెవల్-2 ADAS: అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఆధునిక డ్రైవర్ సహాయక వ్యవస్థలు.
  • భద్రత:6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS).
  • ప్రాక్టికాలిటీ: విశాలమైన క్యాబిన్, బూట్ స్పేస్, కుటుంబ అవసరాలకు అనువైన డిజైన్.
  • ప్రీమియం డిజైన్: ఆధునిక LED హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, ఏరోడైనమిక్ స్టైలింగ్.

వేరియంట్‌ను బట్టి కొన్ని ఫీచర్లు మారే అవకాశం ఉంది.

 

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *