ISRO Resignations | ఇస్రోలో వరుస రాజీనామాలు.. ఎగ్జిట్ నిబంధనలు మార్చిన కేంద్రం

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: ISRO Resignations | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వరుసగా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు రాజీనామా చేస్తుండటంతో కేంద్ర అంతరిక్ష శాఖ (DoS) అప్రమత్తమైంది. ముఖ్యంగా ‘గగన్‌యాన్’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు, గ్రేడ్-1 స్థాయి అధికారులు , సాంకేతిక సిబ్బంది రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) నిబంధనలను కేంద్రం కఠినతరం చేసింది.

ISRO Resignations | వంద మందికి పైగా..

ఇటీవలి కాలంలో ఇస్రోలో సుమారు 100 మందికి పైగా సైంటిస్టులు, ఇంజినీర్లు సంస్థను వీడటం చర్చనీయాంశమైంది. ఇందులో యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (URSC) నుంచి 80 మంది, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) నుంచి 20 మంది వరకు ఉన్నట్లు సమాచారం. రాజీనామా చేసిన వారిలో చంద్రయాన్-3 ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన ఆదిత్య నల్లపల్లి, LVM-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ విక్టర్ జోసెఫ్ వంటి సీనియర్ అధికారులు ఉండటం గమనార్హం.

isro.1

ISRO Resignations | కొత్త నిబంధనలు ఇవే..

ఇస్రో జారీ చేసిన అంతర్గత మెమోరాండం ప్రకారం, ఇకపై గ్రేడ్-1 అధికారుల రాజీనామాలను సాధారణ పద్ధతిలో ఆమోదించరు. గతంలో సెంటర్ డైరెక్టర్లకే రాజీనామాలు ఆమోదించే అధికారం ఉండేది, కానీ ఇప్పుడు ఆ అభ్యర్థనలను వారి సిఫార్సులతో నేరుగా ఢిల్లీలోని కేంద్ర అంతరిక్ష శాఖకు (DoS) పంపాలి. సంబంధిత శాస్త్రవేత్తలు తమ బాధ్యతలను పూర్తిగా పూర్తి చేసిన తర్వాతే విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ISRO Resignations | చైర్మన్ స్పందన..

ఈ పరిణామాలపై ఇస్రో చైర్మన్ నారాయణన్ స్పందిస్తూ, పెద్ద సంస్థల్లో ఉద్యోగుల మార్పు సహజమని, ప్రాజెక్టులకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గగన్‌యాన్ మిషన్ నిర్ణీత సమయానికే పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా, సంస్థ దాదాపు 1,050కి పైగా శాస్త్రవేత్తలు, సాంకేతిక , పరిపాలనా పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రక్రియను చేపడుతోంది.

ఇది కూడా చదవండి: Adluri Laxman Kumar | గురుకుల విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి అడ్లూరి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *