Gianni Infantino UN | ఫిఫా బాస్‌కు ఐరాస పగ్గాలు?.. ట్రంప్ సరికొత్త ఆలోచన

ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్ష పదవిలో ఉన్న గియాని ఇన్‌ఫాంటినోను ఐక్యరాజ్యసమితి (UN) ప్రధాన కార్యదర్శిగా చూడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Gianni Infantino UN | ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్ష పదవిలో ఉన్న గియాని ఇన్‌ఫాంటినోను ఐక్యరాజ్యసమితి (UN) ప్రధాన కార్యదర్శిగా చూడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను ట్రంప్, గియాని కలిసి వీక్షించిన అనంతరం ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రపంచ దేశాలను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో గియాని ప్రతిభను ట్రంప్ ప్రశంసించారు.

Gianni Infantino UN | ఫిఫా చీఫ్‌పై ప్రశంసలు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి పౌలో జంపోలి వెల్లడించిన వివరాల ప్రకారం.. 211 సభ్య దేశాలున్న ఫిఫాను గియాని ఇన్‌ఫాంటినో అద్భుతంగా నిర్వహించారని ట్రంప్ కొనియాడారు. ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చే సత్తా ఆయనకు ఉందని, అదే బాధ్యతను 193 దేశాల సమాఖ్య అయిన ఐక్యరాజ్యసమితికి కూడా అప్పగిస్తే బాగుంటుందనే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు ఆయన తెలిపారు.

Gianni Infantino UN | పోటీ తీవ్రత..

ఐరాస ప్రధాన కార్యదర్శి పదవికి అంతర్జాతీయ స్థాయిలో పోటీ భారీగానే ఉంటుంది. ప్రస్తుతం ఫిఫా అధ్యక్షుడిగా గియానికి సంవత్సరానికి సుమారు రూ. 58 కోట్ల (6 మిలియన్ డాలర్లు) ఆదాయం వస్తుండగా, ఐరాస చీఫ్‌గా బాధ్యతలు చేపడితే కేవలం రూ. 4 కోట్ల (4.18 లక్షల డాలర్లు) వేతనం మాత్రమే లభిస్తుంది.

Gianni Infantino UN | అర్హతలు..

ప్రస్తుత ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరెస్‌ పదవీకాలం ఈ సంవత్సరం డిసెంబర్‌తో ముగియనుంది. ఈ పదవిని దక్కించుకోవాలంటే 15 దేశాల భద్రతా మండలి మద్దతుతో పాటు, ఐదు శాశ్వత దేశాల (యూఎస్‌ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా) వీటో హక్కులను దాటాల్సి ఉంటుంది. అంతేకాకుండా, తదుపరి యూఎన్ చీఫ్ లాటిన్ అమెరికా లేదా కరీబియన్ ప్రాంతం నుంచి ఉండవచ్చని అంచనాలున్నాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన గియాని నియామకంపై సభ్య దేశాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి.

ఇది కూడా చదవండి:  Parliament Protest | పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల నిరసన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *