అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Generic Drug Tariffs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో బాంబు పేల్చారు. ఆగస్టు 2028 నుండి దిగుమతి చేసుకునే జెనరిక్ మందులపై భారీ సుంకాలను విధిస్తామని ప్రకటించారు.
ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల ఉత్పత్తిని దేశీయంగానే చేపట్టడమే లక్ష్యంగా సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాకు జెనరిక్ మందులను అత్యధికంగా ఎగుమతి చేసే భారతదేశంపై ఈ చర్య ప్రభావం చూపే అవకాశం ఉంది. దశలవారీ సుంకాల ప్రణాళిక ఆగస్టు 1 నుండి అమల్లోకి వస్తుందని, మొదటి రెండు సంవత్సరాలు దేశంలోకి తీసుకువచ్చే అన్ని జెనరిక్ మందులపై యునైటెడ్ స్టేట్స్ సున్నా శాతం సుంకాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. మూడవ సంవత్సరానికి, సుంకాన్ని 100 శాతానికి, ఆ తర్వాత 200 శాతానికి పెంచుతామని ఆయన అన్నారు.
Generic Drug Tariffs | 200 శాతం టారిఫ్స్
ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి యునైటెడ్ స్టేట్స్‌లోకి తీసుకువచ్చే అన్ని జెనరిక్ మందులపై రెండు సంవత్సరాల పాటు సున్నా శాతం సుంకం కొనసాగుతుందని ట్రంప్ తెలిపారు. ఆ తర్వాత ఏడాది పాటు 100 శాతం సుంకాలు అమలు చేస్తామని, మరో సంవత్సరం తర్వాత 200శాతానికి పెంచుతామని వెల్లడించారు. జెనరిక్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిని అమెరికాకు తిరిగి తీసుకురావడానికే దీని లక్ష్యమని పేర్కొన్నారు. పేటెంట్, బ్రాండెడ్, వినూత్న ఔషధాలపై పాత విధానం యథాతథంగా కొనసాగుతుందన్నారు.
Generic Drug Tariffs | భారత్ వాటా 40 శాతం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు భారత్ జెనరిక్ మందులను సరఫరా చేస్తోంది. అమెరికాలో, భారతీయ జెనరిక్ మందుల వాటా దాదాపు 40 శాతం ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, భారతదేశం అమెరికాకు 9.7 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మాస్యూటికల్స్‌ను ఎగుమతి చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం చేసిన మొత్తం 25.8 బిలియన్ డాలర్ల ఫార్మా ఎగుమతులలో 38 శాతంగా ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదిక తెలిపింది. సుంకాలు విధిస్తే భారత ఎగుమతులపై ప్రభావం పడనుంది.
‘అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని జెనెరిక్ ఔషధాలపై ఆగస్టు 1 నుంచి రెండేళ్లపాటు 0% సుంకం వర్తిస్తుంది. ఆ తర్వాత ఏడాది పాటు ఈ సుంకం రేటును 100 శాతానికి మరియు ఆ తదుపరి కాలంలో 200 శాతానికి పెంచుతాం’ –అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Trump Announces Tariff Plan for Generic Drug… pic.twitter.com/nnVi5U9G9c
— Akshara Today | Telugu News (@aksharatoday) July 22, 2026
దీనిని కూడా చదవండి : DOST Special Phase | డిగ్రీ అడ్మిషన్లకు ‘స్పెషల్ ఫేజ్’ షెడ్యూల్ విడుదల.. 26 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం!