అక్షరటుడే వెబ్డెస్క్: Bonalu Festival Significance | తెలంగాణ ( Telangana )సంస్కృతికి ప్రతీకైన బోనాల పండుగలో అమ్మవారికి సమర్పించే ప్రతి నైవేద్యం వెనుక ఆధ్యాత్మిక చింతనతో పాటు అద్భుతమైన శాస్త్రీయ , వైద్య సంబంధిత కారణాలు దాగి ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభంలో వచ్చే వ్యాధుల బారిన పడకుండా మానవ శరీరాన్ని కాపాడుకునేందుకు పూర్వీకులు ఏర్పాటు చేసిన అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు ఈ సంప్రదాయంలో నిక్షిప్తమై ఉన్నాయి.
Bonalu Festival Significance | భూదేవికి కృతజ్ఞతగా..
అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ప్రధాన బోనంలో పాలు, బెల్లం, కొత్త బియ్యంతో తయారు చేసే పరమాన్నం భూదేవికి కృతజ్ఞతగా నిలుస్తుంది. ఇక ఉగ్రరూపంలో ఉండే అమ్మవారిని శాంతింపజేయడంతో పాటు ఆరోగ్యానికి ప్రశాంతత చేకూర్చేందుకు చలువ చేసే పెరుగును కుండపై ఉంచి ఊరేగింపులో దద్దోజనంగా పంచుతారు. గ్రామీణ సంప్రదాయం ప్రకారం వ్యాధుల నుండి కాపాడినందుకు కృతజ్ఞతగా ఇళ్లలో నాటుకోడి , మటన్ విందులు ఏర్పాటు చేసుకుంటారు. ఈ మాంసాహారం వల్ల కలిగే కడుపు ఉబ్బరాన్ని తగ్గించి, అరుగుదలకు అద్భుతంగా తోడ్పడేందుకు బోనాలతో పాటు ఔషధ గుణాలు నిండిన పచ్చి పులుసును ప్రత్యేకంగా వడ్డిస్తారు.
Bonalu Festival Significance | వ్యాధులు వ్యాప్తి చెందకుండా..
అలాగే ఘటం ఊరేగింపులో విరివిగా వాడే పసుపు, వేపాకులు అత్యుత్తమ క్రిమిసంహారకాలుగా (Antiseptics) పనిచేసి, గాలి ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందకుండా పరిసరాలను శుద్ధి చేస్తాయి. చరిత్రాత్మకంగా చూస్తే 1813లో ప్రబలిన ప్లేగు వ్యాధి నివారణ చర్యల నుంచే ఈ బోనాల పండుగ ఆవిర్భవించింది. కుటుంబమంతా కలిసి ఆనందంగా జరుపుకునే ఈ పండుగ విందులో వాడే పాలు, పెరుగు, నెయ్యి వంటి పాల ఉత్పత్తులతో ప్రతి తెలంగాణ ఇంట ‘జెర్సీ’ భాగమవుతోందని గోద్రేజ్ జెర్సీ మార్కెటింగ్ హెడ్ శాంతను రాజ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: DIET Deputation | ‘డైట్ డిప్యుటేషన్ల’లో అక్రమాలు.. అభ్యర్థుల ఆందోళన