OpenAI AI Speaker చాట్‌జీపీటీ స్మార్ట్ స్పీకర్.. ఓపెన్ ఏఐ కొత్త ఏఐ కంపానియన్

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ (OpenAI) సరికొత్త హార్డ్‌వేర్ డివైజ్‌ను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: OpenAI AI Speaker | ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ (OpenAI) సరికొత్త హార్డ్‌వేర్ డివైజ్‌ను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. చాట్‌జీపీటీని భౌతిక రూపంలోకి తీసుకువచ్చేలా ఒక ప్రీమియం ఏఐ స్మార్ట్ స్పీకర్‌ను రూపొందిస్తోంది. ఇది సాధారణ స్మార్ట్ స్పీకర్ కాకుండా, మానవుడిలా స్పందించే ఒక ‘ఏఐ కంపానియన్’ లా పనిచేయనుంది. యాపిల్ మాజీ డిజైనర్ జోనీ ఇవ్‌కు చెందిన ‘లవ్‌ఫ్రమ్’ (LoveFrom) స్టూడియోతో కలిసి ఈ డివైజ్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

OpenAI AI Speaker | డిజైన్ , రూపకల్పన..

ఈ పరికరం డిస్‌ప్లే లేకుండా డోనట్ లేదా హాకీ పక్ (hockey puck) ఆకారంలో ఉండనుంది. ఒక్క చేతితో సులభంగా పట్టుకుని ఇంట్లో ఎక్కడికైనా తీసుకెళ్లేలా, ప్రీమియం మెటల్ మెటీరియల్స్‌తో దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఇది పూర్తిగా బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులో మూవింగ్ పార్ట్స్ ఉంటాయి. డివైజ్ రెస్పాండ్ అవుతున్నప్పుడు లేదా యూజర్‌తో మాట్లాడుతున్నప్పుడు ఇవి స్వయంగా కదులుతూ మానవుడిలా ప్రవర్తిస్తాయి.

OpenAI AI Speaker | టెక్నాలజీ , ఫీచర్లు..

ఇందులో లైట్లు, మైక్రోఫోన్లు, కెమెరాలు, సెన్సార్లు ఉంటాయి. ఇవి చుట్టుపక్కల వాతావరణాన్ని గమనించి ఏఐకి సమాచారాన్ని అందిస్తాయి. ఇది చాట్‌జీపీటీ వాయిస్ మోడ్ మాదిరిగానే ఉంటుంది. కానీ మరింత అడ్వాన్స్‌డ్ మోడల్స్‌తో సహజంగా మాట్లాడుతుంది. కాలక్రమేణా యూజర్ అలవాట్లను గమనించి, వారి నుంచి నేర్చుకుంటూ వ్యక్తిగత సంభాషణలు కొనసాగిస్తుంది. ఇది ఓపెన్ ఏఐకి మొట్టమొదటి హార్డ్‌వేర్ ఉత్పత్తి కావడం విశేషం. దీనిని 2027లో లేదా అంతకంటే ముందే మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

OpenAI AI Speaker | ప్రధాన ఉపయోగాలు..

మానవుల్లాగే సహజంగా మాట్లాడుతూ సందేహాలను నివృత్తి చేస్తుంది. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం, మీడియాను ప్లే చేయడం వంటి పనులు చేస్తుంది. ఇంట్లోని ఇతర స్మార్ట్ పరికరాలను నియంత్రించడానికి సహాయపడుతుంది. కెమెరాలు, సెన్సార్ల ద్వారా చుట్టుపక్కల పరిస్థితులను గ్రహించి, ఉదాహరణకు వంటగదిలో ఉంటే అందుకు తగిన సూచనలు ఇస్తుంది. ఇంట్లో ఒక చోటు నుంచి మరో చోటుకు సులభంగా తీసుకెళ్లి ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Bonalu Funds Telangana | బోనాల ఉత్సవాలకు తక్కువ నిధులా? రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *