Banana Tree Vastu | ఇంటి ఆవరణలో అరటి చెట్టు నాటవచ్చా ?.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..

ఇంట్లో చెట్లు, మొక్కలు నాటడంపై వాస్తు , జ్యోతిష్య శాస్త్రాల్లో ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Banana Tree Vastu | ఇంట్లో చెట్లు, మొక్కలు నాటడంపై వాస్తు , జ్యోతిష్య శాస్త్రాల్లో  ( Astrology )ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. హిందూ ధర్మంలో అరటి చెట్టును శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి కొలువుండే పవిత్రమైన వృక్షంగా భావిస్తారు. ఇంట్లో అరటి చెట్టును పెంచడం వల్ల గురు గ్రహ దోషాలు తొలగిపోయి, కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు కలుగుతాయని నమ్ముతారు. అయితే, ఈ చెట్టును ఎక్కడ పడితే అక్కడ కాకుండా, కొన్ని నిర్దిష్టమైన దిశలలో మాత్రమే నాటాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

Banana Tree Vastu | కలిగే శుభ ఫలితాలు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అరటి చెట్టును గురు గ్రహానికి ప్రతీకగా చెబుతారు. జాతకంలో గురు దోషం ఉన్నవారు ప్రతిరోజూ అరటి చెట్టుకు నీరు పోసి పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ చెట్టు ఉన్న ఇళ్లలో సానుకూల శక్తి (Positive Energy) పెరిగి ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది. అలాగే, విద్యార్థులకు ఉన్నత విద్య, జ్ఞానం సిద్ధిస్తాయి.

Banana Tree Vastu | వివాహం, సంతాన ప్రాప్తి..

పెళ్లి ఆలస్యమవుతున్న వారు అరటి చెట్టును క్రమం తప్పకుండా పూజిస్తే త్వరలోనే శుభప్రదమైన ఫలితాలు వస్తాయని నమ్ముతారు. భార్యాభర్తల మధ్య గొడవలు తొలిగిపోయి వైవాహిక జీవితం సంతోషంగా సాగడానికి, సంతాన భాగ్యం కలగడానికి కూడా ఈ పూజ సహాయపడుతుంది.

Banana Tree Vastu | ఏ దిశలో నాటాలి?

అరటి చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా లేదా ముందు భాగంలో నాటకూడదు. అలాగే దక్షిణ, పడమర దిశలలో కూడా ఈ చెట్టును ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదు. అరటి మొక్కను ఎల్లప్పుడూ ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలలో (పెరట్లో) మాత్రమే నాటాలి. అరటి చెట్టు తన జీవితకాలంలో ఒకే గెలను ఇచ్చి అంతమవుతుంది కాబట్టి, దానిని పెరట్లోనే పెంచి పూజించడం ఆచారం. ఈ వాస్తు నియమాలను పాటిస్తూ సరైన దిశలో నాటడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Paddy Farmers | వరి సాగు చేసిన రైతులు రిజిస్ట్రర్​ చేసుకోవాలి : మంత్రి తుమ్మల

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *