అక్షరటుడే, వెబ్డెస్క్: Aug 18 Horoscope | జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఇవాళ చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. స్వాతి నక్షత్రంతో పాటు బ్రహ్మ, శుక్ల యోగాలు రూపొందడం విశేషం. అంతేకాక గురు, చంద్రుల కలయికతో గజకేసరి, అమల యోగాలు , కుజుడి మిథున రాశి సంచారం వల్ల పలు రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం లభించనుంది. మరికొన్ని రాశుల వారు గ్రహాల స్థితిగతుల వల్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండక తప్పదు.
Aug 18 Horoscope | రాశుల వారీగా..
మేష రాశి: Aug 18 Horoscope | చంద్ర సంచారం అనుకూలంగా ఉండటంతో సంతోషం, ప్రశాంతత పెరుగుతాయి. ఉద్యోగులకు సహోద్యోగులు, స్నేహితుల నుంచి పూర్తి మద్దతు దక్కుతుంది. చేసే పనులలో ఆశించిన లాభాలు రావడమే కాకుండా సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
వృషభ రాశి: Aug 18 Horoscope | శుభ యోగాల వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది. అయితే బుధుడి ప్రభావంతో ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నందున పొదుపుపై దృష్టి పెట్టడం అవసరం. ఉద్యోగులు ఆఫీసులో అప్రమత్తత పాటించాలి. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. నూతన ఉద్యోగానికి ప్రయత్నించేవారికి ఇది అనుకూల సమయం.
మిథున రాశి: Aug 18 Horoscope | బుధ, చంద్రుల సానుకూల ప్రభావంతో మీరు తలపెట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరుస్తారు. అనుకున్న కోరికలు నెరవేరి, కుటుంబంలో , ప్రేమ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
కర్కాటక రాశి: Aug 18 Horoscope | గ్రహ బలం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. తల్లి నుండి పూర్తి ఆశీస్సులు, మద్దతు లభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇవాళ కలసివస్తుంది.
సింహ రాశి: Aug 18 Horoscope | సూర్యుడి శుభ ప్రభావం ఉన్నప్పటికీ, కేతువు వల్ల కొన్ని అంశాల్లో అయోమయం నెలకొనవచ్చు. ఆర్థిక లావాదేవీలలో, ఉద్యోగ బాధ్యతలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
కన్యా రాశి: Aug 18 Horoscope | ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కాబట్టి బడ్జెట్ను అదుపులో ఉంచుకోండి. ఇప్పుడు చేసే చిన్న పొదుపు కూడా భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఏ పనినీ రేపటికి వాయిదా వేయకండి. పనులను నిదానంగా, ఓర్పుతో పూర్తి చేయడం మంచిది. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించండి.
తులా రాశి: Aug 18 Horoscope | చంద్రుడు సొంత రాశిలో ఉండటంతో మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు ఆఫీసులో మద్దతు లభిస్తుంది, వ్యాపారులకు మంచి లాభాలు అందుతాయి. విద్యార్థులు విద్యారంగంలో రాణిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగుతుంది.
వృశ్చిక రాశి: Aug 18 Horoscope | గురు గ్రహ ప్రభావంతో ఆత్మవిశ్వాసం, ఆర్థిక నిలకడ పెరుగుతాయి. అయితే శుక్రుడు బలహీనంగా ఉన్నందున ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు రావచ్చు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి సహనం పాటించాలి.
ధనుస్సు రాశి: లాభ స్థానంలో చంద్రుడి సంచారం వల్ల రాబడి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం, కార్యసాధనా శక్తి పెరుగుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల అండదండలు లభిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది.
మకర రాశి : ఇవాళ వీరికి మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక అంశాల్లో, కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. శని తిరోగమనం వల్ల కొన్ని పనుల్లో జాప్యం లేదా ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఓర్పుతో వ్యవహరించడం , ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టడం శ్రేయస్కరం.
కుంభ రాశి: రాహు ప్రభావం వల్ల కొన్ని ముఖ్యమైన ఆశయాలు నెరవేరినప్పటికీ, బడ్జెట్ విషయంలో జాగ్రత్త వహించాలి. కొత్త పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆలోచనా విధానంలో ధనాత్మక మార్పు తెచ్చుకోవాలి. ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
మీన రాశి: శని సంచార ప్రభావం అనుకూలించి నిలిచిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ధన ప్రవాహం పెరిగి ఆర్థిక స్థితి బలపడుతుంది. నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. నిత్యం లేదా క్రమం తప్పకుండా శివారాధన/హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.