అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Modi Putin Meeting | కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్కెక్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సోమవారం ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. మానవాళి ప్రయోజనం కోసం మనం ‘అంతులేని యుద్ధం’ నుండి ‘యుద్ధం ముగింపు’ దిశగా అడుగులు వేయాలని మోదీ అన్నారు.
మోదీ మాట్లాడుతూ.. మనం ఉక్రెయిన్ అంశంపై నిరంతరం చర్చిస్తూనే ఉన్నామన్నారు. గతంలో కలిసినప్పుడు, ఈ విషయానికి సంబంధించిన అన్ని అంశాలపై పుతిన్ తనకు వివరంగా చెప్పారన్నారు. శాంతి కోసం చేసే అన్ని ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇస్తుందన్నారు. యుద్ధంలో గడిపే ప్రతి రోజూ మానవాళిని వెనక్కి నెడుతుందని మోదీ పేర్కొన్నారు. మనం అంతులేని యుద్ధం నుండి యుద్ధ ముగింపు వైపు పయనించాలని ఆకాంక్షించారు.
Modi Putin Meeting | 40 వేల మంది విద్యార్థులు
రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. రష్యాలో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య విషయంలో భారతదేశం అగ్ర దేశాలలో ఒకటిగా ఉందన్నారు. ఇటీవలి సంవత్సరాలలో, ఈ సంఖ్య ఏడు రెట్లు పెరిగి, ఇప్పుడు 40 వేలకు చేరుకుందని తెలిపారు. క్రమం తప్పకుండా భారతదేశం, రష్యా సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. అధ్యక్షుడు పుతిన్‌తో విస్తృత స్థాయి చర్చలు జరిపానని ఎక్స్ వేదికగా మోదీ ప్రకటించారు. భారత్-రష్యా మధ్య ఉన్న ‘ప్రత్యేక, విశేషాధికార వ్యూహాత్మక భాగస్వామ్యం’లోని అన్ని అంశాలపై చర్చించామని తెలిపారు.
Modi Putin Meeting | ఒకే కారులో ప్రయాణం
ద్వైపాక్షిక సమావేశం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బిష్కెక్ అరీనాలో జరిగిన VI వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవానికి ఒకే కారులో ప్రయాణించారు. భారత్-రష్యా స్నేహ సంబంధాలలో ఇంధనం, ఆవిష్కరణలు, అంతరిక్షం, ఎరువులు, ప్రజల మధ్య సంబంధాలు ప్రధానాంశాలుగా కొనసాగుతున్నాయి.
Bishkek, Kyrgyzstan: Prime Minister Narendra Modi and Russian President Vladimir Putin travelled in the same car as they headed to the opening ceremony of the VI World Nomad Games at Bishkek Arena, following their bilateral meeting. pic.twitter.com/N1idp7i2Nu
— ANI (@ANI) August 31, 2026
దీనిని కూడా చదవండి : Pension Applications | ప్రభుత్వం గుడ్‌న్యూస్.. పింఛన్ దరఖాస్తుల గడువు పొడిగింపు