Stock Market Today | ద్రవ్యోల్బణ భయాలు.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 374 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్లు పడిపోయాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Stock Market Today | పశ్చిమ ఆసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో మార్కెట్‌ను ఇన్ఫ్లెషన్ భయాలు వెన్నాడుతున్నాయి. బలహీనమైన గ్లోబల్ సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసింది.

Stock Market Today | బాండ్ ఈల్డ్స్ ప్రభావం..

ఇన్ఫ్లెషన్ భయాలతో సమీప భవిష్యత్తులో అమెరికా వడ్డీ రేట్లను పెంచుతుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. దీంతో గ్లోబల్ బాండ్ ఈల్డ్స్‌కూ రెక్కలొస్తున్నాయి. అమెరికాలో ( US )అధిక వడ్డీ రేట్లు ఉంటే.. భారతదేశం వంటి వర్ధమాన మార్కెట్లు ప్రపంచ పెట్టుబడిదారులకు తక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దీంతో ఈక్విటీ మార్కెట్ ఒత్తిడికి గురవుతోంది.

Stock Market Today | భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 473 పాయింట్ల గ్యాప్ డౌన్ లో ప్రారంభమై అక్కడినుంచి 61 పాయింట్లు పెరిగింది. తిరిగి అమ్మకాల ఒత్తిడితో మరో 397 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 197 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 38 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 110 పాయిట్లు పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 374 పాయింట్ల నష్టంతో 76,570 వద్ద, నిఫ్టీ 141 పాయింట్ల నష్టంతో 23,914 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Today | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,914 కంపెనీలు లాభపడగా 2,428 స్టాక్స్ నష్టపోయాయి. 234 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 149 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 149 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top gainers..
బీఎస్ఈ సెన్సెక్స్‌లో 10 స్టాక్ లాభపడగా.. 20 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. అదానీ పోర్ట్స్ 1.63 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.02 శాతం, పవర్‌గ్రిడ్ 1 శాతం, ఎన్టీపీసీ 0.96 శాతం, టైటాన్ 0.70 శాతం లాభపడ్డాయి.

Top losers..
ఆసియన్ పెయింట్ 1.61 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.56 శాతం, ఎం అండ్ ఎం 1.56 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.49 శాతం, బీఈఎల్ 1.33 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: Konda Surekha Comments | సీఎం రేవంత్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *