Iran Attack on Jordan | జోర్డాన్​లోని యూఎస్​ స్థావరంపై ఇరాన్​ దాడి

జోర్డాన్‌లోని అమెరికన్ వైమానిక స్థావరంపై బుధవారం రాత్రి ఇరాన్​ దాడులు చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran Attack on Jordan | జోర్డాన్‌లోని అమెరికన్ వైమానిక స్థావరంపై బుధవారం రాత్రి ఇరాన్​ దాడులు చేసింది. ఈ ఘటనలో అనేక అమెరికా సైనిక విమానాలు దెబ్బతిన్నాయని సమాచారం.

ఇరాన్​ (Iran) దాడుల్లో అమెరికాకు చెందిన ‘వార్‌హాగ్’ అని పిలువబడే ఒక ఏ-10 థండర్‌బోల్ట్ విమానం దెబ్బతింది. మువఫ్ఫాక్ సాల్టీ వైమానిక స్థావరంపై ఇరాన్ దాడులు చేసింది. సుమారు 8 ఎఫ్-15 విమానాలు స్వల్పంగా తిన్నట్లు సమాచారం. ఇరాన్ దాడులను ఎదుర్కోవడానికి జోర్డాన్‌లోని అమెరికన్ దళాలు 30కి పైగా క్షిపణులను ప్రయోగించాయి. ఇరాన్​కు చెందిన ఐదు ట్యాంకర్లపై అమెరికా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి ప్రతికారంగా ఇరాన్​ జోర్డాన్​లోని యూఎస్​ స్థావరంపై దాడి చేసింది. మరో రెండు యుద్ధనౌకలపై తాము దాడులు చేసినట్లు ఐఆర్​జీసీ ప్రకటించింది.

Iran Attack on Jordan | కీలకమైన కేంద్రం

జోర్డాన్​లోని మువఫ్ఫాక్ సాల్టీ వైమానిక స్థావరం ఇరాన్​కు వ్యతిరేకంగా పని చేయడానికి అమెరికాకు కీలకమైన కేంద్రం. ఇక్కడ నుంచి అనేక యుద్ధ విమానాలు పని చేస్తున్నాయి. దీనిపై ఇరాన్​ దాడులు చేపట్టడం గమనార్హం. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటూ ఉండటంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర స్థాయికి చేరాయి. ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచ మార్కెట్లు కుదేలు అవుతున్నాయి. హర్ముజ్​ జలసంధి మీదుగా వెళ్లే నౌకలపై ఇరాన్​ దాడులు కొనసాగిస్తోంది. డజనుకు పైగా నౌకలపై దాడి చేసినట్లు టెహ్రాన్ తెలిపింది.

ఇది కూడా చదవండి..: Iran Seizes US Submarine | అమెరికా జలాంతర్గామిని స్వాధీనం చేసుకున్న ఇరాన్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *