అక్షరటుడే, వెబ్డెస్క్: Sep 15 Horoscope | గ్రహాల ప్రభావంతో నేడు (మంగళవారం, సెప్టెంబరు 15) ద్వాదశ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. కొన్ని రాశుల వారికి ఆశించిన స్థాయిలో పురోగతి, ధనలాభం కలిగితే, మరికొన్ని రాశుల వారికి చేపట్టిన పనుల్లో చిన్నపాటి అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
Sep 15 Horoscope | రాశుల వారీగా..
మేష రాశి: Sep 15 Horoscope | ప్రశాంతమైన జీవితానికి ఆధ్యాత్మిక చింతన ఎంతో అవసరం. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకుని బడ్జెట్ పాటించడం మేలు. ఆఫీసులో మీరు చేసిన పనులకు తగిన గుర్తింపు, తోటివారి ప్రశంసలు లభిస్తాయి.
వృషభ రాశి: Sep 15 Horoscope | ఆదాయం పెంచే కొత్త అవకాశాలు కనిపించినా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఏర్పడి నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి.
మిథున రాశి: Sep 15 Horoscope | మీ చురుకైన తెలివితేటలతో కొత్త విషయాలను సులువుగా నేర్చుకుని విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం. చిన్న చిన్న విభేదాలను పక్కనబెట్టి పాత పరిచయాలను పునరుద్ధరించుకోవడం వల్ల ప్రశాంతత లభిస్తుంది.
కర్కాటక రాశి: Sep 15 Horoscope | రోజంతా ఉత్సాహంగా పనులు పూర్తి చేయగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల అనుకోని మార్గాల ద్వారా అదనపు ఆదాయం అందుతుంది. మీ నాలెడ్జ్ పెంచుకోవాలనే ఆసక్తితో సమాజంలో కొత్త మిత్రుల పరిచయం ఏర్పడుతుంది. ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి.
సింహ రాశి: Sep 15 Horoscope | ఊహల్లో కాకుండా వాస్తవ పరిమితులను గ్రహించి పని చేయడం వల్ల ఆశించిన ఫలితాలు వస్తాయి. మీ ప్రతిభతో ఆఫీసులో, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మిత్రులతో సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గి మనసుకు కొత్త ఉత్సాహం లభిస్తుంది.
కన్యా రాశి: Sep 15 Horoscope | ఓర్పు, అవగాహనతో అడుగులు వేయడం వల్ల అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. కొత్త పెట్టుబడి అవకాశాలు వచ్చినప్పుడు వాటి వివరాలను పూర్తిగా అధ్యయనం చేశాకే ముందుకు వెళ్లాలి. మీ ఆలోచనా శైలి, ప్రత్యేక నైపుణ్యాల వల్ల సామాజిక వేడుకల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ శ్రేయస్సు కోసం ధనాత్మక దృక్పథంతో చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
తులా రాశి: Sep 15 Horoscope | ప్రముఖ వ్యక్తులను కలిసినప్పుడు వెనుకంజ వేయకుండా ఆత్మవిశ్వాసంతో సంభాషించడం మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండండి.
బంధువులు, మిత్రుల రాకతో సాయంత్రం వేళ ఇంట్లో ఎంతో ఉత్సాహభరిత వాతావరణం ఉంటుంది. ఆఫీసులో మీ అద్భుతమైన పనితీరుతో సహోద్యోగులను, అధికారులను ఆకట్టుకుంటారు.
వృశ్చిక రాశి: Sep 15 Horoscope | ఇవాళ అందే ఆర్థిక ప్రయోజనాలను దానధర్మాలకు ఉపయోగించి మానసిక ఆనందం పొందుతారు. ఆఫీసు పనిలో మీలోని అంతర్గత సామర్థ్యం మిమ్మల్ని అందరికంటే ముందు నిలబెడుతుంది. అనవసర వాదనలకు దూరంగా ఉంటూ సంభాషణలో పరుషపదాలు వాడకుండా జాగ్రత్తపడండి.
ధనుస్సు రాశి: శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం రోజువారీ జీవితంలో యోగా, ధ్యానం చేయడం మేలు. ఆఫీసులో మీ పనితనానికి ప్రశంసలతో పాటు ప్రమోషన్ లభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అనుభవజ్ఞుల సలహాలతో వ్యాపారాన్ని విస్తరించడం వల్ల మంచి లాభాలు సాధిస్తారు.
మకర రాశి: ఆరోగ్యంగా ఉండటానికి నిత్యం వ్యాయామం చేయండి. అనుకోని ఖర్చుల వల్ల పొదుపు కొద్దిగా నెమ్మదించినా త్వరలోనే పరిస్థితులు సర్దుకుంటాయి. ప్రయాణాలు లేదా వాహనాలు నడిపేటప్పుడు అదనపు జాగ్రత్త వహించడం ఎంతో అవసరం.
కుంభ రాశి: జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను అనుభవాలుగా మలుచుకుని ముందుకు సాగాలి. పండుగ వేడుకల్లో కలిసే పెద్దల సలహాలు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తాయి. కార్యాలయంలో మీ అసలైన నైపుణ్యాలను నిరూపించుకోవడానికి అద్భుత అవకాశాలు వస్తాయి. సమయానికి పనులు పూర్తి కాకపోయినా కుటుంబ సభ్యుల సహకారంతో సులువుగా గట్టెక్కుతారు.
మీన రాశి: ఇతరుల మంచి సలహాలను వినడం ద్వారా మీ సమస్యలకు సులువైన పరిష్కారాలు దొరుకుతాయి. బాకీలు తిరిగి చెల్లించని వారికి దూరంగా ఉండటం మేలు. ఆఫీసులో మీ పనితీరుతో సీనియర్లను విశేషంగా ఆకట్టుకుని మంచి గుర్తింపు పొందుతారు. పని ఒత్తిడిని పక్కన పెట్టి కొంత సమయం మీకు నచ్చిన పనుల కోసం కేటాయించండి.