Semicon India 2026 | సెమీ కండక్టర్​ హబ్​గా భారత్ : ప్రధాని మోదీ

గ్లోబల్ సెమీ కండక్టర్ తయారీ హబ్ భారత్‌ను తయారు చేయడమే తమ లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Semicon India 2026 | గ్లోబల్ సెమీ కండక్టర్ తయారీ హబ్ భారత్‌ను తయారు చేయడమే తమ లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘సెమికాన్ ఇండియా 2026’ (SEMICON India 2026) కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.

ప్రధాని మోదీ (Prime Minister Modi) మట్లాడుతూ.. ఇటీవల బ్రిక్స్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించుకున్నాం అని చెప్పారు. భారత్‌పై ప్రపంచానికి నమ్మకం పెరిగింది అనడానికి బ్రిక్స్‌ సమ్మిట్‌ ఉదాహరణ అన్నారు. భారత్‌ చిప్‌ తయారీపై ఫోకస్‌ పెట్టిందని పేర్కొన్నారు. 10 రోజుల క్రితం ముంబైలో ఫిన్‌టెక్‌ సదస్సు జరిగిందని, ఇప్పుడు సెమికాన్ ఇండియా సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు. బ్రిక్స్​ సదస్సులో అందరి మద్దతుతో ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ ఆమోదం పొందడం అనేది అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కున్న విశ్వసనీయతకు మరో నిదర్శనం అని మోదీ అన్నారు.

Semicon India 2026 | మూడు రోజుల పాటు..

మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం దేశంలోని సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ పర్యావరణ వ్యవస్థపై దృష్టి సారిస్తుంది. పరిశ్రమల భాగస్వామ్యం, విధానపరమైన దిశానిర్దేశం, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ఇందులో ప్రాధాన్యతనిస్తారు. ప్రధాని మాట్లాడుతూ.. సెమికాన్​ సదస్సు 2022లో మొదటి సారి జరిగిందన్నారు. అప్పటి నుంచి ప్రతియేటా సమావేశం అవుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు భారతీయ ప్లాంట్ల నుండి తయారైన చిప్‌లు దేశంలోని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు చేరడం ప్రారంభించాయన్నారు.

Semicon India 2026 | జీడీపీ వృద్ధి

భారతదేశ జీడీపీ (GDP) నివేదిక సెప్టెంబర్‌లోనే విడుదలైందని మోదీ గుర్తు చేశారు. సవాలుతో కూడిన ఈ కాలంలోనూ భారతదేశం 7.8 శాతం వృద్ధిని సాధించిందన్నారు. ఒకవైపు భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుండగా, మరోవైపు దేశంపై ప్రపంచానికి ఉన్న నమ్మకం కూడా పెరుగుతోందన్నారు.

ఇది కూడా చదవండి..: Birth Death Registration | జనన, మరణాల నమోదులో కీలక మార్పులు.. అక్టోబర్ 1 నుంచి కొత్త చట్టం అమల్లోకి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *