Stock Market Today | లాభాల్లో ప్రధాన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 254 పాయింట్లు, నిఫ్టీ 117 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Today | ముడిచమురు ధరలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం మరియు ఎన్ ఎస్ ఈ ఐపీవో ప్రారంభం వంటి అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేస్తున్నాయి.

Stock Market Today | అప్రమత్తంగా ఇన్వెస్టర్లు..

మూడేళ్లలో మొదటిసారిగా వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచాలని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం, ఈ ఏడాది చివరి నాటికి కనీసం మరోసారి 25 బేసిస్ పాయింట్ల మేరు పెంపు ఉంటుందన్న సూచనలు ఇవ్వడంతో మొదట ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీనికితోడు ఎన్ ఎస్ ఈ ఐపీవో గురువారం ప్రారంభమైంది. దీంతో ఉదయం ప్రధాన సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.

Stock Market Today | మార్కెట్‌లో ఒడిదుడుకులు..

దేశీయ మార్కెట్లు (Domestic markets) బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 154 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా అక్కడినుంచి కోలుకుని 407 పాయింట్లు పెరిగింది. తిరిగి ప్రాఫిట్ బుకింగ్‌తో 426 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా వెంటనే కోలుకుని 130 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 132 పాయింట్లు తగ్గింది. మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 254 పాయింట్ల లాభంతో 74,590 వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 23,334 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 23 స్టాక్స్ లాభాలతో, 7 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. ఎటర్నల్ 2.27 శాతం, బీఈఎల్ 2.04 శాతం, ఇండిగో 1.83 శాతం, మారుతి 1.47 శాతం, ఎంఅండ్ ఎం 1.35 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : టైటాన్ 0.87 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.81 శాతం, ఇన్ఫోసిస్ 0.40 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.30 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.12 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Sep 17 Gold Prices | పసిడి ధరల పెరుగుదల.. రాబోయే రోజుల్లో బంగారం ఎలా ఉండబోతోంది..?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *