Trump Media Lawsuit | ట్రంప్‌పై CNN, MS NOW, Politico సంయుక్తంగా దావా!

తమ వైట్‌హౌస్ యాక్సెస్‌ను తక్షణమే పునరుద్ధరించేలా తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలని మూడు సంస్థలు కోర్టును కోరుతున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Trump Media Lawsuit | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రముఖ మీడియా సంస్థలు CNN, MS NOW, Politico న్యాయపోరాటానికి దిగాయి.

వైట్‌హౌస్‌లో తమ జర్నలిస్టుల ప్రవేశాన్ని నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ మూడు సంస్థలు సోమవారం ఫెడరల్ కోర్టులో దావా దాఖలు చేశాయి. ఈ చర్య తమ రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

Trump Media Lawsuit | అసంతృప్తితోనే ఈ నిర్ణయం

ట్రంప్ ప్రభుత్వం ఇటీవల CNN, MS NOW, Politico జర్నలిస్టులకు వైట్‌హౌస్‌లోకి ప్రవేశాన్ని నిరాకరించింది. తమపై జరుగుతున్న కవరేజీపై అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఈ మూడు సంస్థలను ‘ఫేక్ న్యూస్’గా అభివర్ణిస్తూ, ఇతర మీడియా సంస్థలపై కూడా ఇలాంటి చర్యలు ఉండవచ్చని ప్రకటించారు.

Zee Entertainment Downfall Story | జీ ఎంటర్టైన్మెంట్ సంక్షోభం..సుభాష్ చంద్ర ‘జీ’ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది?

దీనిపై స్పందించిన మూడు మీడియా సంస్థలు.. ప్రభుత్వం ఏం రిపోర్ట్ చేయాలో, ఏం ప్రచురించాలో నిర్ణయించకూడదని స్పష్టం చేశాయి. తమ జర్నలిస్టుల ఫస్ట్ అమెండ్‌మెంట్ హక్కులను పరిరక్షించుకోవడంతో పాటు, ప్రభుత్వ జోక్యం లేకుండా స్వతంత్ర జర్నలిజాన్ని కొనసాగించే హక్కు కోసం దావా వేసినట్లు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

Trump Media Lawsuit | ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా

వైట్‌హౌస్ తమ జర్నలిస్టుల ప్రెస్ క్రెడెన్షియల్స్‌ను ఎలాంటి ముందస్తు నోటీసు, ప్రక్రియ లేకుండా రద్దు చేసిందని మీడియా సంస్థలు ఆరోపించాయి. ఇది అమెరికా రాజ్యాంగంలోని ఫస్ట్ అమెండ్‌మెంట్ ద్వారా కల్పించిన పత్రికా స్వేచ్ఛ హక్కులకు, అలాగే ఫిఫ్త్ అమెండ్‌మెంట్లోని న్యాయపరమైన ప్రక్రియకు సంబంధించిన హక్కులకు విరుద్ధమని కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించాయి.

తమ వైట్‌హౌస్ యాక్సెస్‌ను తక్షణమే పునరుద్ధరించేలా తాత్కాలిక ఆదేశాలు జారీ చేయాలని మూడు సంస్థలు కోర్టును కోరుతున్నాయి. ఈ కేసుపై అత్యవసర విచారణ ఈ వారంలోనే జరిగే అవకాశం ఉంది.

ఈ వ్యవహారంతో ట్రంప్ ప్రభుత్వానికి, అమెరికా మీడియా సంస్థలకు మధ్య కొనసాగుతున్న వివాదం మరోసారి న్యాయస్థానం ముందుకు వచ్చింది. కేసులో కోర్టు ఇచ్చే ఆదేశాలు వైట్‌హౌస్‌–మీడియా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *