అంతర్జాతీయంTrump Putin Talks | ఇరాన్‌కు రష్యా అండ.. యుద్ధం ముగింపుపై ట్రంప్ క్లారిటీ!

Trump Putin Talks | ఇరాన్‌కు రష్యా అండ.. యుద్ధం ముగింపుపై ట్రంప్ క్లారిటీ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Trump Putin Talks | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాదాపు 90 నిమిషాలకు పైగా సాగిన ఈ చర్చల్లో ఇరాన్ వ్యవహారం, ఉక్రెయిన్ యుద్ధం ప్రధానాంశాలుగా నిలిచాయి.

Trump Putin Talks | ఇరాన్ విషయంలో రష్యా హెచ్చరిక:

టెహ్రాన్‌పై అమెరికా మళ్ళీ సైనిక చర్యలకు దిగడం ఏమాత్రం క్షేమకరం కాదని పుతిన్ (Vladimir Putin) స్పష్టం చేశారు. ఇరాన్‌పై దాడులు జరిగితే అది పశ్చిమాసియాతో పాటు అంతర్జాతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. అయితే, ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారు. దౌత్య పరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి రష్యా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

Trump Putin Talks | యురేనియం నిల్వలు:

ఇరాన్ వద్ద ఉన్న భారీ యురేనియం నిల్వల గురించి కూడా ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఇరాన్ లోని శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తీసుకునేందుకు పుతిన్ సానుకూలత వ్యక్తం చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇది ఇరాన్ అణ్వాయుధ తయారీకి అడ్డుకట్ట వేసే దిశగా ఒక కీలక పరిణామంగా భావిస్తున్నారు.

Trump Putin Talks | కొన్ని రోజుల పాటు కాల్పుల విరమణ :

ఈ చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. “పుతిన్ నాకు సహాయం చేసే కంటే ముందే.. నేను ఆ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాను” అని ట్రంప్ బదులిచ్చారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో కొన్ని రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని పుతిన్ సూచించారని, దీనిపై త్వరలోనే ఒక అధికారిక ప్రకటన రావచ్చని ట్రంప్ సంకేతాలిచ్చారు.

మొత్తానికి, ట్రంప్ – పుతిన్ మధ్య జరిగిన ఈ సంభాషణ పశ్చిమాసియాలో శాంతికి, ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.

ఇది కూడా చదవండి..: Iran New Weapon | అమెరికా భయపడే ఆయుధం సిద్ధం : ఇరాన్​

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Arunachalam Girivalam | అరుణాచలంలో చిత్ర పౌర్ణమి వేడుకలు.. గిరి ప్రదక్షిణకు ముహూర్తం ఖరారు!

అక్షరటుడే, అరుణాచలం: Arunachalam Girivalam |  ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలై...

Nepal Airlines Map | తప్పుడు మ్యాప్‌ వివాదం.. తలవంచిన నేపాల్ ఎయిర్‌లైన్స్!

అక్షరటుడే, న్యూదిల్లీ: Nepal Airlines Map | భారత భూభాగమైన జమ్మూకశ్మీర్‌ను...

MMTS Free Travel | హైదరాబాదీల‌కు గుడ్ న్యూస్.. ఎంవోయూ రెడీ, ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం ఎప్పటి నుండో తెలుసా?

అక్షరటుడే, వెబ్​డెస్క్: MMTS Free Travel | హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్...

Gandhi Bhavan | గాంధీ భవన్ ఎదుట ఉద్యమకారుల ఆందోళన

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gandhi Bhavan | హైదరాబాద్ (Hyderabad)​లోని గాంధీ భవన్​...