Iran New Weapon | అమెరికా భయపడే ఆయుధం సిద్ధం : ఇరాన్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran New Weapon | అమెరికా- ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం లేదు. కాల్పుల విరమణ అమలులో ఉన్నా.. ఇరు దేశాల నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇరాన్‌ నేవీ కమాండర్‌ రేర్‌ అడ్మిరల్‌ షారమ్‌ ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు.

శత్రువు భయపడే ఒక కొత్త ఆయుధాన్ని టెహ్రాన్ (Tehran) త్వరలో మోహరిస్తుందని షారమ్ అన్నారు. ఈ ఆయుధంతో వారికి గుండెపోటు రాదని ఆశిస్తున్నాను అని అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇరాన్ చాలా త్వరలో ప్రత్యర్థి బలగాలను తమకు సమీపంలో ఉన్న సామర్థ్యంతో ఎదుర్కొంటుందన్నారు. అది యుద్ధరంగ గతిని మార్చగలదని పేర్కొన్నారు.

Iran New Weapon | 100కు పైగా దాడులు

ఇరాన్ (Iran) బలగాలు అనేక ప్రతీకార చర్యలు చేపట్టాయని, వాటిలో అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇవి తాత్కాలికంగా వైమానిక కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై ఇరాన్ 100కు పైగా విడత దాడులు చేశామన్నారు.

Iran New Weapon | అనుమతి తప్పనిసరి

హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)లో ప్రత్యర్థితో సంబంధం ఉన్న నౌకల ప్రవేశాన్ని పరిమితం చేశామన్నారు. వాటి రాకపోకలకు ఇప్పుడు ఇరాన్ అనుమతి తప్పనిసరి అని కమాండర్ తెలిపారు. ప్రత్యర్థి బలగాలు మరింత సమీపానికి వస్తే ఇరాన్ తక్షణమే స్పందిస్తుందని హెచ్చరించారు. ఇరాన్ నౌకలను స్వాధీనం చేసుకున్నందుకు అమెరికాను ఇరాన్ కమాండర్ (Iranian Commander) విమర్శించారు. ఈ చర్యలను సముద్రపు దొంగతనంగా అభివర్ణిస్తూ, సిబ్బందిని, వారి కుటుంబాలను అమెరికా దళాలు నిర్బంధిస్తున్నాయని ఆరోపించారు. ఇకపై ఎలాంటి ఘర్షణ జరిగినా దానికి బలమైన ప్రతీకార దాడి ఉంటుందని ఇరానీ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *