అక్షరటుడే, వెబ్‌డెస్క్: Oct 05 Market Analysis | అమెరికా జాబ్ డేటా (US Job data) అంచనాల కంటే బలహీనంగా రావడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచకపోవచ్చన్న అంచనాలు పెరిగాయి.
ఇది ఈక్విటీ మార్కెట్లకు సానుకూలాంశం కావడంతో ఇన్వెస్టర్లు ఊపిరిపీల్చుకున్నారు. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగియగా.. సోమవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు (Asian markets) సైతం లాభాలతో ఉన్నాయి.
Oct 05 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 1.19 శాతం, ఎస్ అండ్ పీ 0.73 శాతం పెరగగా.. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.01 శాతం లాభంతో ఉంది.
Oct 05 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.16 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.78 శాతం లాభంతో, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ ఫ్లాట్ గా ముగిశాయి.
Oct 05 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ 2.53 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.47 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.31 శాతం లాభంతో, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.41 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. చైనా, కొరియా మార్కెట్లకు సెలవు. గిఫ్ట్ నిఫ్టీ 0.62 శాతం లాభంతో ఉండటంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Mumbai Dead Body Case | నాలుగేళ్లుగా ఇంట్లోనే మృతదేహం.. రూ.50 లక్షలు ఖర్చు చేసిన కుటుంబం!
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా ఆరో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. నికరంగా రూ. 9,484 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు వరుసగా 37 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 10,041 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 47 పైసలు బలహీనపడి 96.30 వద్ద ఉంది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 101.37 డాలర్ల వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 102.08 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.26 శాతం వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.79 నుంచి 0.77 కు తగ్గింది.
- విక్స్ 7.15 శాతం పెరిగి 14.45 వద్ద ఉంది.