Oct 06 Horoscope | పిల్లలు సాధించే విజయాలు.. ఇక ఈ రాశుల వారి ఇంట సంతోషాల హరివిల్లు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 06 Horoscope | గ్రహాల సంచారం, నక్షత్రాల స్థితిలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. దీని ప్రభావంతో 12 రాశుల వారి జాతకాల్లో నేడు (మంగళవారం, అక్టోబరు 06) విభిన్నమైన, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొందరికి కెరీర్, వ్యాపారాల్లో ఊహించని పురోగతి, ఆకస్మిక ధనయోగాలు కనిపిస్తుండగా.. మరికొందరు మాత్రం ఖర్చులు, కుటుంబ విషయాల్లో కాస్త ఓర్పు అవసరం.

Oct 06 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: Oct 06 Horoscope | వ్యాపారవేత్తలు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆఫీసులో మీ కష్టానికి తగిన గుర్తింపు, సర్ ప్రైజ్ అందుకుంటారు.

వృషభ రాశి: Oct 06 Horoscope | కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. చిన్న విషయాన్ని పెద్దది చేస్తే కుటుంబంలో ప్రశాంతత దెబ్బతింటుంది. ఇంట్లో ఏ చిన్న మార్పు చేయాలన్నా కుటుంబ సభ్యులందరి ఆమోదం, అభిప్రాయం తీసుకోవడం ఎంతైనా అవసరం. ఆఫీసులో అత్యంత ఓర్పు, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే పనుల్లో ఆశించిన అనుకూల ఫలితాలు సాధిస్తారు.

మిథున రాశి: Oct 06 Horoscope | మీ సానుకూల ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు , గతంలో చేసిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. వ్యాపార, ఉద్యోగపరమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సొంతంగా ఆలోచించడం మంచిది. భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు వేసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

కర్కాటక రాశి: Oct 06 Horoscope | ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ముందస్తుగా చేసుకున్న బడ్జెట్‌కు లోబడి ఖర్చులు చేయడం చాలా అవసరం. పిల్లలు చదువులో, ఇతర రంగాల్లో సాధించే విజయాలు మీకు ఎంతో గర్వాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. ఆఫీసులో కొందరు మీ తప్పిదాలను వేలెత్తి చూపించే అవకాశం ఉంది, కాబట్టి మీ పనుల్లో కాస్త అప్రమత్తంగా ఉండండి. మీ సంభాషణా నైపుణ్యం అందరి ప్రశంసలు అందుకుంటుంది .

సింహ రాశి: Oct 06 Horoscope | దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అవసరమైన సమయంలో తోబుట్టువుల నుండి ఆర్థికంగా, మానసికంగా పూర్తి సహాయ సహకారాలు అందుతాయి. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు , ఇవాళ కాస్త ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతారు.

Akshara Today | Fearless Journalism, a Growing Voice for the People..

కన్యా రాశి: Oct 06 Horoscope | అప్పులు అడిగే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, సమయానికి తిరిగి ఇవ్వని వారికి దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీ మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది , ప్రేమికులకు వివాహ యోగం బలంగా ఉంది. ఆఫీసులో ఇతరుల అనవసర విషయాల్లో కల్పించుకోకపోవడం శ్రేయస్కరం, లేకపోతే మీ పేరు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు .

తులా రాశి: Oct 06 Horoscope | అనుకోని ప్రయాణాలు కొంత అలసటను కలిగించినప్పటికీ, ఆర్థికంగా ఊహించని మంచి ప్రయోజనాలను అందిస్తాయి. ఆఫీసులో మీ పనితీరుకు , ప్రాజెక్టులకు మంచి గుర్తింపు లభిస్తుంది.

వృశ్చిక రాశి: Oct 06 Horoscope | ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉండాలంటే ఇవాళ అనవసర ఖర్చుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ చాలా చురుగ్గా ఉంటారు. నలుగురిలో మీకు మంచి గౌరవం దక్కుతుంది, మీ సలహాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఏ సమస్య వచ్చినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని సంతోషాన్ని పొందుతారు.

ధనుస్సు రాశి: స్నేహితుల ద్వారా ఒక ముఖ్యమైన వ్యక్తి పరిచయమవుతారు. ధనాన్ని సరైన మార్గంలో ఎలా ఉపయోగించాలో గ్రహిస్తారు , మీ సరదా స్వభావంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆఫీసులో పెండింగ్ పనులన్నింటినీ పైఅధికారుల దృష్టికి వెళ్లేలోపే పూర్తి చేయడం మంచిది. ప్రయాణాలు కొంత ఖర్చుతో కూడుకున్నవి అయినప్పటికీ, వ్యాపారపరంగా ఆశించిన మంచి ప్రయోజనాలను ఇస్తాయి.

మకర రాశి: ఆరోగ్యం చాలా బాగుంటుంది. పిల్లల ద్వారా మీ ఇంట్లోకి కొత్త ఉత్సాహం , ఎంతో ఆనందం వెల్లివిరిసే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి, భూ వ్యవహారాల డీల్స్ అనుకూలంగా పూర్తవుతాయి , ఆఫీసులో అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేస్తారు.

కుంభ రాశి: అనుకోకుండా పెరిగే ఖర్చులు మానసిక ప్రశాంతతను కాస్త దెబ్బతీసే అవకాశం ఉంది. ఆఫీసులో అనవసరమైన ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం శ్రేయస్కరం. లేకపోతే మీ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉంది.

మీన రాశి: ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో డబ్బు సంపాదించే కొత్త మార్గాలు , అవకాశాలు వస్తాయి. స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్లడం వల్ల మీ మనస్సుకు ఎంతో హాయిగా, ఉల్లాసంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల నుండి పూర్తి సహకారం అందుతుంది. వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేస్తారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *