Ampere Experience Centre Hyderabad | హైదరాబాద్‌లో ఆంపియర్ కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం.. ఈవీ వాహనాలు ఇక మరింత చేరువ

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'ఆంపియర్' (Ampere) హైదరాబాద్‌లో తన సేవా నెట్‌వర్క్‌ను మరింత విస్తరించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ampere Experience Centre Hyderabad | ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘ఆంపియర్’ (Ampere) హైదరాబాద్‌లో  ( Hyderabad ) తన సేవా నెట్‌వర్క్‌ను మరింత విస్తరించింది. తాడ్‌బన్ – బహదూర్‌పురా మెయిన్ రోడ్‌లో ‘సాన్స్‌టెక్ ఆటోమోటివ్’ (Sanstech Automotive) పేరిట నూతన ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చేస్తున్న నిరంతర విస్తరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ ద్వారా, నగర వినియోగదారులకు అమ్మకాలు , సర్వీస్ సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి.

Ampere Experience Centre Hyderabad | ఆకట్టుకుంటున్న ఈవీ ..

ఈ కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో వినియోగదారుల విభిన్న అవసరాలకు తగ్గట్టుగా పలు ఆంపియర్ మోడళ్లను ప్రదర్శనకు ఉంచారు. ఇందులో 5 kW శక్తివంతమైన మోటర్‌తో వచ్చే ‘ఆంపియర్ నెక్సస్ EX+’ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుండగా.. కుటుంబ అవసరాలు , బడ్జెట్ వినియోగదారుల కోసం ‘మాగ్నస్ జీమాక్స్’, నగరంలో రోజువారీ రాకపోకలకు ‘మాగ్నస్ నియో’ అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఇటీవల విడుదలైన ‘ఆంపియర్ రియో వైబ్’ ప్రత్యేకంగా కాలేజ్ విద్యార్థులు, యువ రైడర్లను ఆకట్టుకునేలా రూపొందించబడింది.

Ampere Experience Centre Hyderabad | కొనుగోలు అనుభవం..

అత్యంత ఆధునిక, ఇంటరాక్టివ్ విధానంలో రూపుదిద్దుకున్న ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, వినియోగదారులు ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయోజనాలను స్పష్టంగా అర్థం చేసుకుని, సులభంగా సమాచారంతో కూడిన కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో సహకరిస్తుంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చేపడుతున్న విస్తరణ చర్యల్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ కేంద్రం, నగరంలో ఈవీల వాడకాన్ని మరింత ప్రోత్సహించడంలో మరో కీలక ముందడుగు అని చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి:  Vangaveeti Radha | జనసేనలో చేరిన వంగవీటి రాధా

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *