Israel Exit Polls | ఎన్నికల్లో నెతన్యాహుకు షాక్​.. హంగ్​ తప్పదన్న ఎగ్జిట్ పోల్స్​

ఇజ్రాయెల్ ఎన్నికల్లో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు షాక్​ తప్పదని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Israel Exit Polls | ఇజ్రాయెల్ ఎన్నికల్లో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)కు షాక్​ తప్పదని ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేశాయి. తన ప్రధాన ప్రత్యర్థి, మాజీ సైనిక అధిపతి గాడి ఐసెన్‌కోట్‌పై నెతన్యాహు అధిక్యంలో ఉన్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మెజారిటీకి అవసరమైన 61 సీట్లకు రెండు కూటములు దూరంగా ఉన్నాయి.

మొదటి లక్ష బ్యాలెట్లను లెక్కించిన తర్వాత నెతన్యాహు పార్టీ సుమారు 27 శాతం ఓట్లతో ఆధిక్యంలో ఉండగా, ఐసెన్‌కోట్ కూటమి దాదాపు 17 శాతం ఓట్లను పొందింది. నెతన్యాహు పార్టీ సుమారు 27 సీట్లతో పార్లమెంటులో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. నెతన్యాహు నేతృత్వంలోని కూటమి, అతని ప్రధాన ప్రత్యర్థి గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని పార్టీల కూటమి చెరో 51 సీట్లను కైవసం చేసుకుంటాయని పోల్స్​ సూచిస్తున్నాయి. మిగిలిన 18 సీట్లను అరబ్ నేతృత్వంలోని పార్టీలు గెలుచుకుంటాయని పేర్కొంటున్నాయి.

Israel Exit Polls | మరో 48 గంటలు

ఎన్నికల తుది ఫలితాలు 48 గంటల్లో వెలువడతాయని అంచనా వేస్తున్నారు. దేశంలోని 120-సీట్ల పార్లమెంటులో ఏ ఒక్క పార్టీ కూడా ఎప్పుడూ సంపూర్ణ మెజారిటీని గెలుచుకోలేదు. ఇరాన్​తో యుద్ధం తర్వాత జరిగిన ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. పోలింగ్ అనంతరం నెతన్యాహు మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.ఇజ్రాయెల్ అరబ్బుల మద్దతుతో ఏ నాయకుడూ పాలించకూడదని, వారి పార్టీలు భారీ లాభాలను నమోదు చేశాయని పేర్కొన్నారు. అయితే హంగ్​ వస్తే ఆ పార్టీలే ఇప్పుడు కీలకంగా మారే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Microsoft Voluntary Exit Offer | మైక్రోసాఫ్ట్‌లో 60 వేల మందికి ఎగ్జిట్ ఆఫర్ .. భారత్‌లోనూ ఉద్యోగాలకు గండం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *