Ghaziabad Wife Murder Plot | జిమ్ ట్రైనర్‌తో ఎఫైర్.. భర్త హత్యకు భార్య స్కెచ్ ..!

ప్రభుత్వ ఉద్యోగి, మంచి జీతం, ఎలాంటి లోటు లేని కాపురం.. కూతురిపై అపారమైన ప్రేమ, భార్యకు కావలసినంత స్వేచ్ఛ ఇస్తూ ఎంతో అన్యోన్యంగా సాగుతున్న ఆ కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చురేపింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ghaziabad Wife Murder Plot | ప్రభుత్వ ఉద్యోగి, మంచి జీతం, ఎలాంటి లోటు లేని కాపురం.. కూతురిపై అపారమైన ప్రేమ, భార్యకు కావలసినంత స్వేచ్ఛ ఇస్తూ ఎంతో అన్యోన్యంగా సాగుతున్న ఆ కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చురేపింది. భర్త ఇచ్చిన స్వేచ్ఛను ఆసరాగా చేసుకున్న భార్య, మరో వ్యక్తి మోజులో పడి ఏకంగా కట్టుకున్న భర్తనే కడతేర్చేందుకు యత్నించిన దారుణ ఉదంతం ఢిల్లీ సమీపంలోని ఘాజియాబాద్‌లో వెలుగుచూసింది. ప్రియుడి దాడిలో తీవ్రంగా గాయపడిన భర్త ప్రస్తుతం ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

Ghaziabad Wife Murder Plot | జిమ్ ట్రైనర్‌తో సీక్రెట్ లవ్..

పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీ  ( Delhi ) ప్రభుత్వంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శశాంక్ కంథారియా (35)కి 2021లో ప్రియ అనే యువతితో వివాహమైంది. వీరికి మూడేళ్ల కూతురు ఉంది. ఘాజియాబాద్‌లోని వసుంధర అపార్ట్‌మెంట్స్‌లో ఈ కుటుంబం నివాసముంటోంది. భార్య ప్రియకు రోజూ జిమ్‌కు వెళ్లే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో జిమ్‌లో ట్రైనర్‌గా చేరిన సింగ్ అనే వ్యక్తితో ప్రియకు పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. గత సెప్టెంబర్‌లో ఈ విషయం భర్త శశాంక్‌కు తెలియడంతో ఆయన భార్యను నిలదీసి, జిమ్ మానాలని లేదా వేరే జిమ్‌కు మారాలని స్పష్టం చేశాడు. అంతేకాకుండా ఫ్లాట్ కూడా ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు.

Ghaziabad Wife Murder Plot | డోర్ ఓపెన్ చేసి వెళ్లిన భార్య..

ఇల్లు మారితే తమ బంధానికి అడ్డుకట్ట పడుతుందని భావించిన ప్రియ, ప్రియుడు సింగ్‌తో కలిసి భర్తను చంపేందుకు పక్కా ప్లాన్ వేసింది. పథకంలో భాగంగా ప్రియ ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ మెయిన్ డోర్‌ను లాక్ చేయకుండా తెరిచి ఉంచింది. ఆమె వెళ్లిన వెంటనే కత్తులతో ఇంట్లోకి ప్రవేశించిన సింగ్.. నిద్రపోతున్న శశాంక్‌పై 9 నుంచి 12 సార్లు దారుణంగా పొడిచాడు. శశాంక్ గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న చిన్నారి నిద్రలేచి పెద్దగా ఏడ్చింది. దీంతో కంగారుపడిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు.

ఇది కూడా చదవండి:  PCC Chief Mahesh Goud | రాహుల్ గాంధీ అంటే బీజేపీ నేతలకు భయం : పీసీసీ చీఫ్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *