హైదరాబాద్: భారతదేశ అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ నెట్ వర్క్ అయిన బోల్ట్.ఎర్త్ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో P Qube సొల్యూషన్స్ వద్ద అధిక సామర్థ్యం కలిగి ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. మొత్తం 1.5 MW ఛార్జింగ్ సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతపు ఈవీ ఛార్జింగ్ మౌలిక వసతులను గణనీయంగా విస్తరించింది.
విజయవాడ లోని నున్నలోజాతీయ రహదారి – 16 క్రాస్ వద్ద నెలకొన్న ఈ కేంద్రం అటు స్థానికులకు, ఇటు అందరికీ అందుబాటులో ఉండేలా నగరాల మధ్య ప్రయాణించే వాహనదారుల అవసరాలను తీర్చేలా ఉంటుంది. ఈ ప్రాజెక్టు అటు హై- పవర్ డీసీ ఫాస్ట్ ఛార్జర్లను, అదే విధంగా వివిధ ఈవీ కేటగిరీలకు రూపొందించబడిన పలు రకాల ఛార్జింగ్ సొల్యూషన్స్ ను కలిగిఉంటుంది. తద్వారా మరింతగా అందుబాటులో ఉండే ఛార్జింగ్ స్థితిగతులకు అండగా నిలుస్తుంది.
కార్లు, ట్రక్కులు, బస్సులకు కూడా తోడ్పడేలా ఇక్కడ ఉన్న వాటిలో రెండు 240 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్లు, మూడు 180 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్లు, ఒక 60 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉన్నాయి. అదే విధంగా ద్విచక్ర వాహనాలకు, త్రిచక్ర వాహనాల ఛార్జింగ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇందులో 6 kW త్రీ వీలర్ ఫాస్ట్ ఛార్జర్, ద్విచక్ర వాహనాల కోసం రెండు 3 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్లు, నాలుగు 3.3 kW AC ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి.
భారతదేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా అందరికీ అందు బాటులో ఉండే చోట నెలకొన్న ఈ అధిక సామర్థ్య ఛార్జింగ్ మౌలిక వసతులు ఎలక్ట్రిక్ మొబిలిటీ పరివర్తనకు అండగా ఉంటాయి. P Qube సొల్యూషన్స్ ఛార్జింగ్ స్టేషన్ వంటి పరిణామాలు ఛార్జింగ్ మౌలికవసతులు కల్పించే సంస్థలు, స్థలాలు అందించే వారి మధ్య సహకారాలు ఇప్పటికే నిలదొక్కుకున్న పట్టణ కేంద్రాలను దాటి ఛార్జింగ్ యాక్సెస్ ను విస్తరించడానికి ఎలా తోడ్పడుతాయో తెలియజే స్తాయి.
దీని గురించి బోల్ట్.ఎర్త్ వ్యవస్థాపకులు జ్యోతిరంజన్ హరిచందన్ గారు మాట్లాడుతూ, ‘‘ఉన్నతస్థాయి ఈవీ ఛార్జింగ్ మౌలిక వసతులను నిర్మించడం అనేది సరైన విధంగా సాంకేతికతను, విద్యుత్ (పవర్) లభ్యత మరియు వ్యూహాత్మకంగా అందుబాటులో నెలకొన్న స్థలాలు అనే అంశాల సరైన సమ్మేళనంగా ఉంటుంది. 1.5 MW ఛార్జింగ్ సామర్థ్యం, పలు అధిక స్థాయి డీసీ ఫాస్ట్ ఛార్జర్స్లతో విజయవాడలో P Qube సొల్యూషన్స్ ఈ అంశాల న్నింటినీ ఒక్కచోటకు చేర్చింది. P Qube సొల్యూషన్స్‌తో భాగస్వామ్యం మాకెంతో ఆనందదాయకం. దేశంలో ఈవీ యూజర్ల మారుతున్న అవసరాలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ దీర్ఘకాలిక వృద్ధికి అండగా నిలిచేలా సుస్థిరదాయక, విశ్వసనీయ ఛార్జింగ్ మౌలిక వసతులను నిర్మించాలంటే ఇలాంటి వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఎంతో అవసర మని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.
ఈ భాగస్వామ్యం గురించి P Qube సొల్యూషన్స్‌కు చెందిన డి ఫణి ప్రకాశ్ గారు మాట్లాడుతూ, ‘‘ఈ ప్రాజెక్టు మా కుటుంబ ఆశయంలో మూలాన్ని కలిగి ఉందిి. ఇది మాకెంతో ముఖ్యమైంది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు మొదలుకొని ఫోర్ వీలర్ ప్యాసింజర్ కార్లు లాంటి అన్ని ముఖ్యమైన ఈవీ విభాగాల్లో బోల్ట్.ఎర్త్ ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్స్ ను అందిస్తోంది, అందువల్లనే మేం దాన్ని మా భాగస్వామిగా ఎంచుకున్నాం. వారు హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ మొదలుకొని విక్రయానంతర సేవల మద్దతు వరకూ అన్నీ ఒకేచోట నిర్వహిస్తారు. ఇలాంటిది మార్కెట్లో చాలా అరుదు. ఇది మా అనుభవాన్ని తిరుగులేనిదిగా చేస్తోంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో రూపుదిద్దుకుంటున్న వృద్ధి అవకాశాలను ఈ ప్రయత్నం ప్రముఖంగా చాటిచెబుతుంది. అందులో భాగం కావడం మాకెంతో ఆనందదాయకం. జాతీయరహదారి -16పై ఉన్న ఈ వ్యూహాత్మక ప్రాంతం తన ప్రభావాన్ని మరింత అధికం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈవీ ఛార్జింగ్ మౌలిక వసతుల విస్తరణకు మద్దతు ఇస్తుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారేందుకు ఈ ప్రాంతపు పరివర్తనకు అండగా నిలుస్తుంది’’ అని అన్నారు.
భారతదేశ ఈవీ స్థితిగతులు పరిపక్వత చెందుతున్న కొద్దీ, ఇలాంటి భారీ స్థాయి ఛార్జింగ్ ఏర్పాట్లు ఛార్జింగ్ అందుబాటును మెరుగుపరుస్తాయి. సుదూర ప్రయాణాలకు అండగా నిలుస్తాయి. వివిధ ప్రాంతాల్లో ఈవీ అనుసరణను వేగవంతం చేస్తాయి.