అక్షరటుడే, వెబ్డెస్క్: Punjab DA Case | ప్రభుత్వ ఉద్యోగులపై సుప్రీం కోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. డీఏ ఇతర అలవెన్సులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ కూడా లభిస్తుందని, అసంఘటిత రంగం, కార్పొరేట్ రంగం మొదలైన వాటితో పోలిస్తే వారు ప్రత్యేక హక్కులు గల వర్గం అని కోర్టు తెలిపింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని, అప్పుడే వారు జవాబుదారీగా ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్చెల్లించాలనే తీర్పును అమలు చేయనందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు పంజాబ్ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులపై ప్రారంభించిన క్రిమినల్ ధిక్కార చర్యలను సుప్రీంకోర్టు గురువారం నిలిపివేసింది. సివిల్ సర్వీసెస్ అధికారులకు చెల్లిస్తున్నట్లు పంజాబ్లోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం డీఏ, డీఆర్ చెల్లించాలని ఆగస్టు 3న హైకోర్టు ఆదేశించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంతో క్రిమినల్ ధిక్కార చర్యలు ప్రారంభం అయ్యాయి. దీంతో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Punjab DA Case | చిత్తశుద్ధితో ఉంటే..
జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టింది. హైకోర్టులో జరుగుతున్న క్రిమినల్ ధిక్కార చర్యలను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేసింది. పెండింగ్‌లో ఉన్న మొత్తాలను చెల్లించేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసి, మార్చి 2027 నాటికి లేదా అంతకు ముందే సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా ఉద్యోగుల గురించి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు చిత్తశుద్ధితో ఉంటే ఈ దేశంలో వ్యాజ్యాలు తగ్గుతాయని పేర్కొంది. ఉద్యోగి మరణానంతరం వారి కుటుంబాలు పెన్షన్లు పొందుతున్నాయని, ప్రభుత్వ ఉద్యోగుల జవాబుదారీతనం ఎక్కడ ఉందని ప్రశ్నింంచింది.
ఇది కూడా చదవండి..: Delhi Building Collapse | ఢిల్లీలో కూలిన మూడంతస్తుల భవనం