AP Local Elections | కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చి ఓటు వేసిన ప్రజలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP Local Elections | ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh)లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఓటు వేసేందుకు ఉదయం నుంచి ఓటర్లు లైన్​లలో వేచి ఉన్నారు. అయితే ఏజెన్సీ గ్రామాల ప్రజలు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చి ఓటు వేసి, ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.

అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) జిల్లాలోని మారుమూల కొండ గ్రామాలకు చెందిన 18 మంది ఓటర్లు తమ గ్రామాలకు రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నినాదాలు చేస్తూ.. ర్యాలీగా కొండ ప్రాంతాల నుంచి పోలింగ్ కేంద్రానికి బయలు దేరారు. ఈ మేరకు వీడియో వైరల్​ అవుతోంది. తాము రోడ్ల కోసమే ఓటు వేస్తున్నామని నినాదాలు చేస్తూ, తాత్కాలిక డోలీలలో వృద్ధులను మోసుకుంటూ గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు వచ్చారు.

AP Local Elections | మొదటి సారి..

వారు మాట్లాడుతూ.. తమ గ్రామాలకు రోడ్డు వేయాలని, మొదటి సారి ఓటు వేస్తున్నామని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు అవుతున్న తమకు రోడ్డు సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ఇదే మొదటిసారి అని గ్రామస్తులు తెలిపారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూసేందుకు, వృద్ధులను డోలీలలో మోసుకుంటూ తమతో పాటు తీసుకువెళ్లారు. కాగా ఆ గ్రామాలకు మోటారు వాహనాలు వెళ్ళే రోడ్ల సౌకర్యం ఇప్పటికీ లేదు.

ఇది కూడా చదవండి..: Madanapalle Land Grab | నకిలీ పత్రాలతో భూ ఆక్రమణలు.. మదనపల్లె ‘లేడీ డాన్’ సులోచన అరెస్ట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *