Nov 11 Market Analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు..ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nov 11 Market Analysis | అమెరికాలో ఊహించిన దానికంటే అధిక ద్రవ్యోల్బణం(Inflation) నమోదు కావడంతో వచ్చే నెలలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు బలపడుతున్నాయి. దీంతో పాటు ఇన్ఫ్లెషన్ ను కట్టడి చేయడానికి కేంద్ర బ్యాంకు మరింత దూకుడుగా వ్యవహరించవచ్చనే ఆందోళనలు పెరగడంతో మంగళవారం వాల్‌స్ట్రీట్(Wall street) నష్టాలతో ముగిసింది.

అయితే కోర్‌వీవ్ ఇంక్. ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం భవిష్యత్తుపై ఉన్న ఆందోళనలు కాస్త తగ్గాయి. దీంతో అమెరికా ఫ్యూచర్స్ పుంజుకున్నాయి. బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో పలు ఆసియా స్టాక్ మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్ గా ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Nov 11 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.74 శాతం, ఎస్ అండ్ పీ 0.32 శాతం నష్టపోయాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.24 శాతం లాభంతో ఉంది.

Nov 11 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.30 శాతం, ఫ్రాన్స్‌ France కు చెందిన సీఏసీ 0.93 శాతం లాభపడగా.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.29 శాతం నష్టంతో ముగిసింది.

Nov 11 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.80 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.06 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.72 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.29 శాతం లాభంతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.71 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.26 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.01 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 7,212 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డీఐఐలు వరుసగా ఎనిమిదో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. రూ. 7,172 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 1 పైస బలహీనపడి 93.93 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 102.21 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.99 శాతం వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.28 నుంచి 1.23 కి తగ్గింది.
  • విక్స్ 5.48 శాతం తగ్గి 17.42 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 91.84 డాలర్ల వద్ద ఉంది.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *