Summer special camps | ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి ప్రత్యేక శిబిరాలు: డీఈవో రాజు

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Summer special camps | జిల్లాలోని 6 నుండి 9 వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం 21 ప్రత్యేక వేసవి శిబిరాలు (summer camps) నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు (Kamareddy DEO Raju) తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Summer special camps | ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక..

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 11 నుండి ప్రారంభమయ్యే విద్యావారోత్సవాల ప్రారంభం రోజు ఈ శిబిరాలు సైతం ప్రారంభమవుతాయన్నారు. పీఎంశ్రీ పాఠశాలలలో 15 రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాలలో స్థానిక వసతులను బట్టి స్టిచింగ్, సంగీతం, శాస్త్రీయ నృత్యం, డ్రాయింగ్, వ్యక్తిత్వ వికాసం, ఇండోర్ క్రీడలు, కరాటే(Karate), యోగా, స్పోకెన్ ఇంగ్లిష్ తదితర అంశాల్లో విద్యార్థులకు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ శిక్షణలో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్స్ కూడా అందిస్తామన్నారు. జిల్లాలోని విద్యార్థులు ఆయా మండలాల్లో నిర్వహించే ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Summer special camps | ఈ పాఠశాలల్లో..

తాడ్వాయి(Tadwai) మండల విద్యార్థులు కామారెడ్డి (Kamareddy education) బాలుర పాఠశాలలో, మాచారెడ్డి మండల విద్యార్థులు పాల్వంచ పాఠశాలలో, మహమ్మద్ నగర్ మండల విద్యార్థులు నిజాంసాగర్ మోడల్ స్కూల్​లో, డోంగ్లి మండల విద్యార్థులు మద్నూర్​లో హాజరు కావాల్సి ఉంటుందన్నారు. కామారెడ్డి అర్బన్ విద్యార్థులు బాలుర పాఠశాలలో, రూరల్ విద్యార్థులు చిన్నమల్లారెడ్డి పాఠశాలలో హాజరు కావాలని, మిగిలిన మండల విద్యార్థులు ఆయా మండలాల్లో ఉన్న ప్రభుత్వ లేదా మోడల్ పీఎంశ్రీ పాఠశాలల్లో(PM SHRI schools) సమ్మర్​ క్యాంప్​లకు హాజరు కావాలన్నారు.

ఇది కూడా చదవండి: Election Commission Case|సుప్రీంకోర్టులో కేంద్రానికి షాక్.. ఆ విన్నపాన్ని తోసిపుచ్చిన ధర్మాసనం!

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *