అక్షరటుడే, వెబ్‌డెస్క్: April 19 Gold Rates | అక్షయ తృతీయ పర్వదినం నేపథ్యంలో దేశవ్యాప్తంగా బంగారం, వెండి మార్కెట్లు సందడిగా మారాయి. ఈ రోజున బంగారం Gold కొనుగోలు చేస్తే శుభం కలుగుతుందని విశ్వసించే ప్రజలు పెద్ద సంఖ్యలో జ్యువెలరీ దుకాణాల వద్దకు తరలివస్తున్నారు. ముఖ్యంగా మహిళలు నగల కొనుగోళ్లలో ఆసక్తి చూపుతుండడంతో బంగారం డిమాండ్ పెరిగింది.
అయితే, ప్రస్తుతం ధరలు స్థిరంగా కనిపిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులు బులియన్ మార్కెట్‌ను అస్థిరంగా మార్చే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే గ్లోబల్ ఆర్థిక వృద్ధిలో మందగమనం బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలుగా పేర్కొంటున్నారు.
April 19 Gold Rates | ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ..
ఏప్రిల్ 19, ఆదివారం నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,780 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,42,800గా ఉంది. విజయవాడలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
- ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,55,930, 22 క్యారెట్ల ధర రూ.1,42,950గా నమోదైంది.
- ముంబైలో Mumbai 24 క్యారెట్ల ధర రూ.1,55,780, 22 క్యారెట్ల ధర రూ.1,42,800గా ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,56,660, 22 క్యారెట్ల ధర రూ.1,43,600గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,55,780, 22 క్యారెట్ల ధర రూ.1,42,800గా కొనసాగుతోంది.
- ఇక వెండి ధరలు విషయానికి వస్తే..వెండి ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, చెన్నై నగరాల్లో కిలో వెండి ధర రూ.2,80,000గా ఉండగా, ఇతర నగరాల్లో సుమారు రూ.2,75,000 వద్ద ట్రేడవుతోంది.
April 19 Gold Rates |
పండుగ సీజన్ కారణంగా బంగారం డిమాండ్ పెరిగింది. జ్యువెలరీ షాపుల్లో భారీ రద్దీ కనిపిస్తోంది. డిమాండ్ ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే బంగారం కొనుగోలు చేసే సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. నగలు కొనుగోలు చేసే సమయంలో 3% జీఎస్టీతో పాటు మేకింగ్ ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ Dollar విలువ ఆధారంగా ధరలు రోజులో మారే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు స్థానిక దుకాణాల్లో తాజా ధరలను చెక్ చేయడం మంచిది. ముఖ్యంగా BIS హాల్‌మార్క్ ఉన్న నగలను మాత్రమే కొనుగోలు చేయడం ద్వారా నాణ్యతపై నమ్మకం పొందవచ్చు.
ఇది కూడా చదవండి: April 19 Horoscope | నూతన వ్యాపార ఆలోచనలతో కలిసొచ్చే అదృష్టం.. ఈ రాశుల వారికి ఇక లాభాల జాతరే!

