తెలంగాణRTC Workers Strike | సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులు.. చర్చలకు పిలవని ప్రభుత్వం

RTC Workers Strike | సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులు.. చర్చలకు పిలవని ప్రభుత్వం

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 22 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని గతంలోనే ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రకటించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: RTC Workers Strike | ఆర్టీసీ కార్మికులు (RTC Workers) మరో 48 గంటల్లో సమ్మెకు సిద్ధం అవుతున్నారు. గతంలోనే కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ నెల 22 నుంచి నిరవదిక సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ నాయకులు (RTC JAC Leaders) ప్రకటించారు.

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతామని చెప్పినా.. రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఇప్పటి వరకు చర్చలకు ఆహ్వానించలేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ మినహా అన్ని డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అయితే కార్మిక నేతలతో ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపలేదు. దీంతో తాము సమ్మెకు వెళ్తామని కార్మికులు చెబుతున్నారు. సమ్మె అనివార్యమైతే ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వం చూస్తోంది.

RTC Workers Strike

RTC Workers Strike | రేపు మంత్రితో చర్చలు

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)​తో ఆర్టీసీ జేఏసీ నేతలు మంగళవారం మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే చర్చలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో కార్మికులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. తమ అన్ని డిమాండ్లు నెరవేర్చాలని వారు కోరుతున్నారు. కార్మికులు సమ్మెకు వెళ్తే ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపడం, అద్దె బస్సులను నడపడం వంటి అంశాలపై రవాణా శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతామని తెలిపింది. పొన్నంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు సఫలం అయితే సమ్మె ప్రకటన విరమించుకునే అవకాశం ఉంది. లేదంటే రాష్ట్రంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోనుంది.

ఇది కూడా చదవండి..: Gachibowli Fire Accident | గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం.. 15 బైక్​లు దగ్ధం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...