NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్​ప్లాంట్స్​లో నిమ్స్​ అరుదైన రికార్డు.. 2K మైలురాయి పూర్తి

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్ లో అరుదైన మైలురాయిని అందుకున్న నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (NIMS) కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్​లో దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది.

NIMS Kidney Transplants | దక్షిణ భారత దేశంలో నెంబర్ వన్

నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2,000 కిడ్నీ మార్పిడులు పూర్తి చేసింది. కిడ్నీ మార్పిడులలో దక్షిణ భారత దేశంలో నిమ్స్​ నెంబర్ వన్​గా నిలిచింది.

దేశంలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్​లో గుజరాత్​ లోని ఐకేడీఆర్‌సీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. సెకండ్ ప్లేస్‌లో లూథియానా క్రిస్టియ‌న్ కాలేజీలో ఉండగా.. నిమ్స్ మూడో స్థానంలో ఉంది.

NIMS Kidney Transplants | CM అభినందనలు

ఈ అరుదైన మైలురాయిని సాధించి కిడ్నీ బాధితులకు విశేష సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

ఈ 2,000 మందిలో 1,900 మంది అంటే 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయించుకోవటం విశేషం.

2023 జనవరి నుంచి గడిచిన మూడేళ్ల నాలుగు నెలల్లోనే.. 500 కిడ్నీ మార్పిడులు చేసి రికార్డు నెలకొల్పింది.

Varalakshmi Controversial Comments | మగాడు కేవలం ‘స్పేర్ పార్ట్’ మాత్రమేనా?…..

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *