Aug 29 Horoscope | ప్రేమను వ్యక్తపరచడానికి ఈ రాశి వారికి మంచి రోజు ఇదే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Aug 29 Horoscope | ఇవాళ్టి ( ఆగస్టు 29) రాశిఫలాల ప్రకారం.. వివిధ రాశుల వారికి ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ అంశాలలో మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి.

కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుండగా, మరికొన్ని రాశుల వారు ఖర్చులు, ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది.

Aug 29 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: Aug 29 Horoscope | ఆధ్యాత్మిక విషయాలతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇతరులను ఆకట్టుకోవడం కోసం అధికంగా ఖర్చు చేయడం మానుకోవాలి. కుటుంబంలో ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నప్పటికీ, జీవిత భాగస్వామితో సమయం ఆహ్లాదకరంగా గడుస్తుంది.

వృషభ రాశి: Aug 29 Horoscope | ఆరోగ్య పరంగా చాలా బాగుంటుంది. భవిష్యత్తులో లాభాన్నిచ్చే వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంట్లో పండుగ వాతావరణం టెన్షన్లను దూరం చేస్తుంది. ప్రేమ జీవితంలో మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది అనుకూలమైన రోజు.

మిథున రాశి: Aug 29 Horoscope | శరీరానికి విశ్రాంతి అవసరం. ఆర్థిక పరంగా తల్లిదండ్రుల సహకారం లభించడంతో సమస్యలు తొలగిపోతాయి. పిల్లల వ్యవహారాల్లో కాస్త ఓపికగా వ్యవహరించాలి. భాగస్వామితో గడపడానికి సమయం దొరికినప్పటికీ, వారి అనారోగ్యం కారణంగా కొన్ని పనులకు ఆటంకం కలగవచ్చు.

కర్కాటక రాశి: Aug 29 Horoscope | స్నేహితుల సలహాలతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిలిచిపోయిన బాకీలు వసూలు కావడంతో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబంలో ప్రశాంతత కోసం అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. రోజంతా బిజీగా గడిచినా, జీవిత భాగస్వామి సహకారం ఊరటనిస్తుంది.

సింహ రాశి: Aug 29 Horoscope | ఆరోగ్యరీత్యా అతిగా తినడాన్ని నియంత్రించుకోవాలి. కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశం ఉంది. ప్రేమ , స్నేహ బంధాలు బలపడతాయి. వైవాహిక జీవితంలో మధురమైన క్షణాలను ఆస్వాదిస్తారు. పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకండి.

కన్యా రాశి: Aug 29 Horoscope | బరువు నియంత్రణపై శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆభరణాలు లేదా గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. పగటి కలలు కనడం మాని లక్ష్యాలపై దృష్టి పెట్టాలి.

తులా రాశి: Aug 29 Horoscope | ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది. యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసిక బలాన్ని పొందవచ్చు. ఇరుగుపొరుగు వారి జోక్యంతో కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు రాకుండా జాగ్రత్తపడాలి.

AI Shiva Song Balochistan | నెట్టింట మార్మోగుతున్న’శివ బోలో.. బలూచిస్తాన్ ఆజాద్’: ఏఐ సృష్టించిన అద్భుత ఆధ్యాత్మిక, సాంస్కృతిక గీతం!

వృశ్చిక రాశి: Aug 29 Horoscope | దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కష్టానికి తగిన గుర్తింపు లభించి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ప్రేమ జీవితంలో భాగస్వామి ఇచ్చే ఆశ్చర్యపరిచే ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఒంటరిగా గడపడానికి కాస్త సమయం దొరుకుతుంది.

ధనుస్సు రాశి: వృత్తిపరంగా మీ నైపుణ్యాలకు పరీక్ష ఎదురవుతుంది. గతంలో చేసిన అనవసర ఖర్చుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. చిన్నపిల్లలతో గడపడం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది.

మకర రాశి: అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండి ఖర్చులను పరిమితం చేసుకోవాలి. ఇంటి పనుల్లో జీవిత భాగస్వామికి సహాయం చేయడం ద్వారా బంధం బలపడుతుంది. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది.

కుంభ రాశి: మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవడం ద్వారా సంతృప్తికరమైన జీవితాన్ని పొందవచ్చు. చిన్నతరహా వ్యాపారస్తులకు ఇతరుల సలహాలు ఆర్థిక లాభాలను తెచ్చిపెడతాయి. శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ అవసరం.

మీన రాశి: ఆహారపు అలవాట్ల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. సృజనాత్మక నైపుణ్యాల ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. కుటుంబంతో కలిసి గడిపే సమయం ఎంతో మధురంగా మారుతుంది. వాయిదా వేసిన పనులను ఇవాళే పూర్తి చేయడానికి ప్రయత్నించండి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *