అక్షరటుడే, వెబ్‌డెస్క్: June 18 Horoscope | జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇవాళ (గురువారం, జూన్ 18 – 2026) ఆకాశంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ, గురుడు పుష్య నక్షత్రం మొదటి దశలో ప్రవేశించి ‘ఉచ్ఛ’ స్థితిలో ఉండటం వల్ల అరుదైన ‘హంస రాజయోగం’ ఏర్పడనుంది.
ఇదే సమయంలో కర్కాటక రాశిలో గురు-చంద్రుల కలయికతో ‘గజకేసరి యోగం’తో పాటు, లక్ష్మీనారాయణ, రుచక రాజయోగం, గౌరీ యోగాలు వంటి శుభ యోగాలు వెల్లివిరుస్తున్నాయి.
June 18 Horoscope | రాశుల వారీగా ఫలితాలు..
మేష రాశి: June 18 Horoscope | ఇవాళ మీకు అన్ని రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. చేసే పనిలో అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు.
కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. విలాసవంతమైన వస్తువులను ఇంటికి తీసుకువస్తారు. తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది.
వృషభ రాశి: June 18 Horoscope | ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. చేసే పనులన్నీ విజయవంతం కావాలంటే కాస్త ఓపికగా ఉండాలి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది.
స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఆస్తికి సంబంధించిన చట్టపరమైన సమస్యలు ఉంటే పరిష్కారం లభిస్తుంది.
మిథున రాశి: June 18 Horoscope | అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో శుభవార్తలు వింటారు.
ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రేమ, వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.
కర్కాటక రాశి: June 18 Horoscope | కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు అందుతాయి. ఆస్తిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది సరైన సమయం.
ప్రత్యర్థులు సైతం మీ పనితీరును చూసి ఆశ్చర్యపోయి, మీ సామర్థ్యాన్ని ప్రశంసిస్తారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది.
సింహ రాశి: June 18 Horoscope | కార్యాలయంలో ప్రమోషన్‌కు సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారులకు గొప్ప విజయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.
సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. అదనపు ఆదాయం లభించి, పెద్దల ప్రశంసలు పొందుతారు.
కన్యా రాశి: June 18 Horoscope | పదకొండో స్థానంలో లక్ష్మీ నారాయణ, గౌరీ యోగాలు ఏర్పడటం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు వస్తాయి.
ఖర్చులను అదుపులో ఉంచుకుంటే పొదుపు ప్రణాళికలు సఫలమవుతాయి. కార్యాలయంలోని వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది.
తులా రాశి: June 18 Horoscope | ఇవాళ మీకు అనేక ప్రయోజనాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి.
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. భాగస్వామి నుంచి ప్రయోజనాలు పొందుతారు. మానసిక ప్రశాంతత, కెరీర్‌లో పురోగతి లభిస్తాయి.
వృశ్చిక రాశి: ఇవాళ మీకు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో వాగ్వాదాలు జరగవచ్చు, దీనివల్ల పనిలో ఒత్తిడికి గురవుతారు.
అయితే సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. పనిలో బిజీగా ఉంటారు, అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి రావచ్చు.
ధనస్సు రాశి: ఇవాళ మీకు చాలా ప్రత్యేకమైనది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు వస్తాయి.
ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
మకర రాశి: ఇవాళ ఏర్పడే శుభ యోగాల వల్ల ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీ నిర్వహణ నైపుణ్యాల వల్ల మంచి ప్రయోజనం పొందుతారు.
కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. రాజకీయాల్లో ఉన్నవారికి ప్రజాదరణ పెరుగుతుంది. ఇవాళ కొత్త వాహనం కొనే యోగం ఉంది.
కుంభ రాశి: అనేక రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. కెరీర్ పరంగా గొప్ప పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భవిష్యత్తులో కొత్త పరిచయాల వల్ల ప్రయోజనాలు ఉంటాయి.
ఆరోగ్యం బాగుంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఇది సరైన సమయం. అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది.
మీన రాశి: ఇవాళ మీకు శుభప్రదంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్‌లో పురోగతి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపడం వల్ల మనసు ఆనందంగా ఉంటుంది.