అక్షరటుడే, వెబ్డెస్క్: Oct 30 Horoscope | గ్రహాల గమనం, నక్షత్రాల అనుకూలత ఆధారంగా ద్వాదశ రాశుల వారికి నేడు (శుక్రవారం, అక్టోబరు 30) మిశ్రమ ఫలితాలను అందిస్తోంది. కొందరికి ఆర్థికంగా నూతన అవకాశాలు లభించి ధన లాభం చేకూరితే, మరికొందరికి కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది.
వృత్తి, ఉద్యోగ రంగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభించడంతో పాటు మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆరోగ్య పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాపారాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేక దృష్టి సారించడం ఎంతో ముఖ్యం.
Oct 30 Horoscope | రాశుల వారీగా
మేష రాశి: Oct 30 Horoscope | కొత్త రాబడి మార్గాలు మిమ్మల్ని ఆర్థికంగా ఆకట్టుకుంటాయి. ఇంట్లో అనుకోని గొడవలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ప్రేమలో ఉన్నవారికి ఇవాళ ఎంతో మధురంగా, ఆనందకరంగా సాగుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం.
వృషభ రాశి: Oct 30 Horoscope | కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది సోదరుల నుండి ఊహించిన దానికంటే మెరుగైన సహకారం లభిస్తుంది. చిన్నపాటి వైఫల్యాలకు అధైర్యపడకుండా ముందుకు సాగండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
మిథున రాశి: Oct 30 Horoscope | జూదం లేదా బెట్టింగ్లకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగ వ్యాపారాలలో మీ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యలతో ఆనందంగా గడుపుతారు.జీవిత భాగస్వామి ఇవాళ అద్భుతమైన సర్ ప్రైజ్ ఇచ్చి ఆశ్చర్యపరుస్తారు.
కర్కాటక రాశి: Oct 30 Horoscope | గర్భిణులు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారి ధనలాభాన్ని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల సుఖసంతోషాలలో పాలుపంచుకోవడం ద్వారా వారితో బంధం బలపడుతుంది. మీలోని సహాయ గుణం , విశ్లేషణా నైపుణ్యాలు అందరి ప్రశంసలను అందుకుంటాయి.
సింహ రాశి: Oct 30 Horoscope | ఇవాళ కొత్త నిధులను సమకూర్చుకోవడంతో పాటు మొండి బకాయిలను వసూలు చేస్తారు. కుటుంబ సభ్యుల ద్వారా అంతులేని ఆనందాన్ని పొందుతారు. మీలోని సృజనాత్మకతకు నలుగురి నుంచి ప్రశంసలతో పాటు ఊహించని రివార్డులు లభిస్తాయి.
కన్యా రాశి: Oct 30 Horoscope | మీ ఆరోగ్యం సహకరిస్తుంది. మీ ముందుకు వచ్చే అనేక ఆర్థిక పథకాలను పెట్టుబడి పెట్టేముందు క్షుణ్ణంగా పరిశీలించండి. సన్నిహిత మిత్రులతో కలిసి బయటకు వెళ్లడం వల్ల మనస్శాంతి లభిస్తుంది. ఆఫీసులో మీరు పడే శ్రమకు తోటివారి నుంచి తగిన గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామి ఇవాళ అద్భుతమైన సర్ ప్రైజ్ ఇచ్చి ఆశ్చర్యపరుస్తారు.
తులా రాశి: Oct 30 Horoscope | మీ నైపుణ్యాలను సరిగ్గా ఉపయోగిస్తే అదనపు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు , స్నేహితులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. కుటుంబ విషయాలలో కొద్దిగా సర్దుకుపోవడం ద్వారా అనవసర ఇబ్బందులను తొలగించుకోవచ్చు.
వృశ్చిక రాశి: గ్రహాల అనుకూలత వల్ల గతంలో వేధించిన అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా కోలుకుంటారు. ఇతరుల సహాయంపై ఆధారపడకుండా మీ స్వశక్తితోనే ధనాన్ని సంపాదిస్తారు. బంధుమిత్రుల నుండి అందే చక్కటి సందేశం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీలోని సృజనాత్మకతకు నలుగురి నుంచి ప్రశంసలతో పాటు ఊహించని రివార్డులు లభిస్తాయి.
ధనుస్సు రాశి: వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. అనుకోని అతిథుల రాక వల్ల కొంత ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులు , పిల్లలతో గడిపే సమయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆఫీసులో మిమ్మల్ని వ్యతిరేకించే వారి పట్ల కూడా చిరునవ్వుతో వ్యవహరిస్తే పరిస్థితులు అనుకూలిస్తాయి.
మకర రాశి: మీ ఆకర్షణీయమైన ప్రవర్తన అందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆర్థిక పథకాలను పరిశీలించిన తర్వాతే పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మంచి మద్దతు పొందుతారు. వ్యాపార భాగస్వాములు మీ కొత్త వెంచర్ల పట్ల ఎంతో ఉత్సాహాన్ని చూపుతారు.
కుంభ రాశి: ఇవాళ మీరు ఎంతో ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండి పనులను వేగంగా పూర్తిచేస్తారు. గతంలో చేసిన దీర్ఘకాలిక పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆఫీసులో భావోద్వేగాలకు లోనుకాకుండా పనిపై మాత్రమే పూర్తి శ్రద్ధ పెట్టండి.
మీన రాశి: మీలో ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని రంగాలలోనూ అద్భుతమైన అభివృద్ధి సాధిస్తారు. ఇంటిపై చేసే పెట్టుబడులు మీకు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తాయి. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఉద్యోగ, వ్యాపారాల్లో నిలకడైన పురోగతి ఉండటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.