అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sukhbir Singh Badal | శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌పై దాడి జరిగింది. నాందేడ్‌లో గురుద్వారా వద్ద ఆయనపై కత్తులతో దాడికి పాల్పడ్డారు.
మహారాష్ట్ర (Maharashtra)లోని నాందేడ్‌లో అకాలీదళ్ అధినేత, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి జరిగింది. అక్కడి ఒక గురుద్వారాను సందర్శించిన తర్వాత నగర శివార్లలో బాదల్‌పై ఈ దాడి జరిగింది. ఒక నిహంగ్ సిక్కు వ్యక్తి ‘కిర్పాన్’ (సిక్కుల సంప్రదాయ కత్తి)తో బాదల్‌పై దాడి చేశారని సమాచారం. దాడి జరిగిన వెంటనే బాదల్‌ను నాందేడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో బాదల్ భద్రతా సిబ్బందిలో ఒకరు కూడా గాయపడ్డారు.
Sukhbir Singh Badal | కుటుంబంతో ఉండగా..
దాడి జరిగిన సమయంలో బాదల్ భార్య, అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కూడా ఆయనతోనే ఉన్నారు. సుఖ్‌బీర్ బాదల్ చేతికి గాయమైందని, అయితే అది ప్రాణాంతకం కాదని పార్టీ శ్రేణులు తెలిపాయి. 2024 డిసెంబర్ 4న అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం బయట పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ను హత్య చేసేందుకు జరిగిన ప్రయత్నం నుండి ఆయన తృటిలో తప్పించుకున్నారు.
ఇది కూడా చదవండి: Mallikarjun Kharge purification row | రాజ్యసభలో ఖర్గే ప్రసంగ వివాదం.. శుద్ధీకరణ అంశంపై తీవ్ర గందరగోళం