అక్షరటుడే, కామారెడ్డి: Unseasonal Rain | కామారెడ్డిలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. సోమవారం సాయంత్రం కామారెడ్డి (kamareddy) పట్టణంలో అంతంత మాత్రమే కురిసిన వర్షం శివారు గ్రామాల్లో ముంచెత్తింది.
Unseasonal Rain | అడ్లూర్ గ్రామంలో..
కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని అడ్లూర్ (adloor) గ్రామంలో భారీ వర్షం అన్నదాతలను ఆగం చేసింది. గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రంలో గత నెలరోజులుగా ఎండకు ఎండిన వరిధాన్యం అకాల వర్షంతో తడిసిముద్దయింది. ఎండిన ధాన్యం బస్తాలలో నింపగా ఆ ధాన్యం సైతం తడిసిపోయింది. కుప్పలు చేసిన ధాన్యంపై టార్పాలిన్ కవర్లు (Tarpaulin Covers) కప్పినా కుప్పలు కిందకు వర్షపు నీరు చేసి ధాన్యం తడిసిపోయింది. దాంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం తడిసిపోకుండా రైతులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గత నెల రోజులుగా ఎండిన ధాన్యం అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గిపోయిందని, కాంటాలు చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.



