అక్షరటుడే, వెబ్‌డెస్క్: LPG PNG rules | గృహ వినియోగదారులకు మరింత లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ (LPG) సరఫరా నిబంధనలలో కీలక సవరణలు చేసింది. పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ తీసుకునే వినియోగదారుల కోసం సరికొత్త నిబంధనలను నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
LPG PNG rules | 30 రోజుల్లోగా
ఈ కొత్త నిబంధనల ప్రకారం… ఇంట్లో పీఎన్‌జీ కనెక్షన్ తీసుకున్న గృహ వినియోగదారులు, ఆ తర్వాత 30 రోజుల్లోగా తమకు ఉన్న పాత ఎల్‌పీజీ కనెక్షన్‌ను రద్దు (Surrender) చేసుకోవచ్చు. ఒకవేళ భవిష్యత్తు అవసరాల కోసం ఆ కనెక్షన్‌ను దాచుకోవాలనుకుంటే, దానికి బదులుగా ‘ట్రాన్స్‌ఫర్ వోచర్’ (TV) పొందే సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది.
LPG PNG rules | బదిలీ ఉద్యోగులు, వలసదారులకు పెద్ద ఉపశమనం
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రయోజనం చేకూర్చనుంది. ముఖ్యంగా..
- తరచూ బదిలీలు అయ్యే ఉద్యోగులకు ఈ ట్రాన్స్‌ఫర్ వోచర్ ఎంతో ఉపయోగపడుతుంది.
- ఒక నగరం నుంచి మరో నగరానికి మారే వలస కుటుంబాలకు, విద్యార్థులకు పాత కనెక్షన్‌ను సులువుగా మార్చుకునే వీలు కలుగుతుంది.
- ఇప్పటివరకు పీఎన్‌జీ కనెక్షన్ వస్తే ఎల్‌పీజీ సిలిండర్లను వదులుకోవడంలో ఉన్న ఇబ్బందులను ఈ కొత్త నిర్ణయం తొలగించనుంది. వినియోగదారులు తమకు నచ్చిన ఎంపికను (రద్దు లేదా బదిలీ వోచర్) ఎంచుకునే స్వేచ్ఛను ఈ సవరణ కల్పిస్తోంది.
ఈ సరళీకృత నిబంధనలు తక్షణమే అమలులోకి రానున్నాయి. దీనివల్ల గ్యాస్ కనెక్షన్ల నిర్వహణ మరింత సులభతరం కానుంది.
11,000-Carat Rare Ruby Discovered in Mogok | “రక్తపు వెలుగులీనిన వెదజల్లిన రత్నాల గడ్డ”


