అక్షరటుడే, వెబ్‌డెస్క్: Air India Hijack Threat | కోల్‌కతా నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానాన్ని హైజాక్ చేస్తామని బెదిరింపులు రావడంతో బుధవారం ఉదయం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్‌నకు కొన్ని నిమిషాల ముందు విమానం నుంచి హైజాక్ అలర్ట్ వచ్చింది.
విమానంలోని ఒక టాయిలెట్ అద్దంపై హైజాక్‌కు సంబంధించిన బెదిరింపు సందేశం రాసి ఉన్నట్లు విమాన సిబ్బంది గుర్తించారు. విమానం టేకాఫ్ కోసం సిద్ధమవుతున్న సమయంలో టాయిలెట్ అద్దంపై ఉన్న బెదిరింపు సందేశాన్ని గమనించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించారు.
Air India Hijack Threat | ఐసోలేషన్ బేకు తరలింపు
ఆ తర్వాత విమానాన్ని ఐసోలేషన్ బేకి తరలించారు. అక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ప్రత్యేక విమానాశ్రయ భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువులు ఏవైనా ఉన్నాయేమోనని విమానంలోని ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ బెదిరింపు ఎవరు రాశారు, దీని వెనుక ఎవరున్నారు అనే విషయాలను నిర్ధారించడానికి పోలీసులు, భద్రతా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. అధికారులు విమానాశ్రయ ప్రాంగణం, విమానం లోపల ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Noida Vehicle Ban | బీఎస్-3, బీఎస్-4 వాహనదారులకు బిగ్ అలర్ట్.. రూల్స్ అతిక్రమిస్తే సీజ్ తప్పదు..!