జాతీయంTMC MLA Defection | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు.. టీఎంసీలో భారీ అసంతృప్తి? బీజేపీ...

TMC MLA Defection | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు.. టీఎంసీలో భారీ అసంతృప్తి? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

టీఎంసీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖన్ చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్: TMC MLA Defection | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీలో భారీ అసంతృప్తి నెలకొన్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారని, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారంటూ బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ (BJP MP Soumitra Khan) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సౌమిత్ర ఖన్ మాట్లాడుతూ, దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు టీఎంసీపై అసంతృప్తితో ఉన్నారని, ఒకవేళ బీజేపీకేంద్ర నాయకత్వం ఆమోదం తెలిపితే వారు కాషాయ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఒకవేళ అంత పెద్ద సంఖ్యలో నేతలు పార్టీ మారితే టీఎంసీ రాజకీయ శక్తిగా తీవ్ర ప్రభావం ఎదుర్కొంటుందని అన్నారు.

TMC MLA Defection | టీఎంసీలో అంతర్గత అసంతృప్తి?

అయితే ఈ వ్యాఖ్యలను టీఎంసీ సీనియర్ నేత సౌగ‌త‌ Saugata Roy పూర్తిగా ఖండించారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని, పార్టీని బలహీనపరిచేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఇదే సమయంలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెన‌ర్జీ Abhishek Banerjeeపై కూడా సౌమిత్ర ఖన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన చర్యలను ప్రస్తావిస్తూ ఆయన విమర్శలు గుప్పించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత నేతల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. ఇటీవల టీఎంసీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. బారాసత్ ఎంపీ కాకొలి ఘోష్ దస్తీదార్ Kakoli Ghosh Dastidar పార్టీ పదవులకు రాజీనామా చేయడం, కొన్ని సమావేశాల్లో ఆమె పాల్గొనడం ఊహాగానాలకు కారణమైంది.

TMC MLA Defection | మున్సిపల్ కౌన్సిలర్ల రాజీనామా

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు (Municipal Councilors) రాజీనామా చేసినట్లు వార్తలు రావడం రాజకీయంగా మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొన్ని మున్సిపాలిటీల్లో పెద్ద సంఖ్యలో కౌన్సిలర్లు తప్పుకోవడం టీఎంసీ అంతర్గత పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అయితే ఈ పరిణామాలపై అధికారికంగా టీఎంసీ ఎలాంటి సంక్షోభాన్ని అంగీకరించలేదు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఎన్నికల తర్వాత పార్టీల్లో అభిప్రాయ భేదాలు, నాయకత్వ మార్పులపై చర్చలు సహజమే అయినప్పటికీ, ప్రస్తుతం వినిపిస్తున్న అంశాలపై స్పష్టత రావాలంటే మరిన్ని రాజకీయ పరిణామాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: ED Raids Kerala | కేరళ మాజీ సీఎం నివాసాల్లో ఈడీ దాడులు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...

Hormuz Strait Blockade | హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత.. అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hormuz Strait Blockade | వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం...

Telangana Urban Housing | పేదల సొంతింటి కల నిజం చేస్తూ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. CURE పరిధిలో లక్ష గృహాల నిర్మాణానికి ఆమోదం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Urban Housing | తెలంగాణ రాష్ట్రంలోని అల్పాదాయ...

Hidden Treasure | గుప్తనిధుల కోసం పూజలు..! నగరంలో కలకలం రేపిన ఘటన..

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Hidden Treasure | గుప్తనిధుల కోసం పూజలు...