Advocate Murder Case | అడ్వకేట్​ హత్య కేసు.. ఏడుగురు నిందితుల అరెస్ట్​..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Advocate Murder Case | హైదరాబాద్​లోని మాసబ్​ ట్యాంక్​లో ఇటీవల జరిగిన లాయర్​ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇందుకు సంబంధించిన పలు కీలక విషయాలను సీపీ సజ్జనార్​ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

Advocate Murder Case | స్కార్పియో వాహనంతో ఢీకొట్టి..

సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్ మాసబ్ ట్యాంక్ దగ్గర స్విమ్మింగ్ కోసం వెళ్తున్న సీనియర్ అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్​ను ఒక స్కార్పియో వాహనం వేగంగా వచ్చి ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టింది. నాంపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక ఆధారాలు, హ్యూమన్ సోర్సెస్‌ను ఉపయోగించి ఈ రోజు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Advocate Murder Case

Advocate Murder Case | వక్ఫ్​ ల్యాండ్​ విషయంలో గొడవలు..

అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్​కు మహబూబ్ అలీ ఖాన్, అతని కుమారుడైన ముజాహిద్ ఆలం ఖాన్​ల మధ్య ఒక వక్ఫ్​ ల్యాండ్ మేనేజ్‌మెంట్, కంట్రోల్ విషయమై తీవ్ర వివాదాలు, కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఈ వివాదం కారణంగానే నిందితులు అడ్వకేట్ కదలికలపై పలుమార్లు రెక్కీ నిర్వహించారు. ఇందులో అభిజిత్ అలియాస్ నాని, విక్రమ్ అలియాస్ చింటూ తదితరులు ఉన్నారు.

Advocate Murder Case | జ్యుడీషియల్​ కస్టడీకి నిందితులు

మే 23వ తేదీన నిందితులు పక్కా ప్లాన్‌తో తెల్లవారుజామున 5:45 గంటల సమయంలో అడ్వకేట్ ప్రతిరోజూ బయటకు వెళ్లే సమయానికి స్కార్పియో వాహనంతో వేచి ఉన్నారు. ఆయన బయటకు రాగానే వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టారు. ఘటనలో నిందితులను అరెస్ట్ చేశారు. అలాగే హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనంతో పాటు వారి మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. నిందితులను జ్యుడీషియల్​ కస్టడీ పంపనున్నట్లు సజ్జనార్​ తెలిపారు.

ఇది కూడా చదవండి..: Telangana Employee Arrears | ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *