జాబ్స్​ & ఎడ్యుకేషన్​Women Auto Driver | సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి.. ఆటో డ్రైవర్‌గా మారిన మహిళా టెక్కీ

Women Auto Driver | సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి.. ఆటో డ్రైవర్‌గా మారిన మహిళా టెక్కీ

ఒకప్పుడు సమాజంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే అదో పెద్ద హోదా. లక్షల్లో జీతాలు, విలాసవంతమైన ఇళ్లు, కార్లు, పెళ్లిళ్లలో కోట్ల రూపాయల కట్నాలతో ఐటీ ఉద్యోగుల వైభోగం వేరేలా ఉండేది.

అక్షరటుడే వెబ్‌డెస్క్: Women Auto Driver | ఒకప్పుడు సమాజంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే అదో పెద్ద హోదా. లక్షల్లో జీతాలు, విలాసవంతమైన ఇళ్లు, కార్లు, పెళ్లిళ్లలో కోట్ల రూపాయల కట్నాలతో ఐటీ ఉద్యోగుల వైభోగం వేరేలా ఉండేది. కానీ కాలం మారింది. నేటి ఐటీ రంగంలో విపరీతమైన పని ఒత్తిడి, నిత్యం టార్గెట్‌ల వేట, వీటికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని సందిగ్ధత నెలకొంది. డబ్బులు వస్తున్నా జీవితంలో ప్రశాంతత కరువైంది. ఇలాంటి తరుణంలో, ఐటీ రంగంలో మేనేజర్ హోదాలో ఉన్న ఓ మహిళ.. ఆ ఒత్తిడిని భరించలేక ఉద్యోగానికి గుడ్ బై చెప్పి ఆటో డ్రైవర్‌గా మారిన ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

tekki

Women Auto Driver | లేడీ ఆటో డ్రైవర్ సక్సెస్ స్టోరీ..

ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఓ పోస్టు ద్వారా ఈ మహిళా డ్రైవర్ కథ వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఆటో నడిపేవారిలో పురుషులే ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే ఒక మహిళ ఆటో నడుపుతుండటం చూసిన నెజ్రిన్, ఆమెతో మాట కలిపారు. ఆ సమయంలోనే సదరు మహిళ తన ఐటీ ఉద్యోగం, జీవిత ప్రయాణం గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఐటీ ఇండస్ట్రీలో సాఫ్ట్‌వేర్ మేనేజర్‌గా పనిచేశానని ఆ మహిళ తెలిపారు. అయితే రోజురోజుకూ పెరుగుతున్న పని ఒత్తిడి, మానసిక టెన్షన్లతో విసిగిపోయి.. చివరికి ఆ ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కార్పొరేట్ లైఫ్‌కు స్వస్తి పలికి, సొంతంగా ఓ ఆటో కొనుగోలు చేసి రోడ్డెక్కానని వివరించారు.

Women Auto Driver

Women Auto Driver | నెలకు రూ.60 వేల సంపాదన..

ప్రస్తుతం ఆటో నడపడం ద్వారా తాను ప్రతి నెలా రూ. 60 వేల వరకు సంపాదిస్తున్నానని ఆమె గర్వంగా చెప్తున్నారు. కార్పొరేట్ ఉద్యోగంతో పోలిస్తే ఇక్కడ డబ్బు కొంచెం తక్కువైనా.. అంతకుమించి మానసిక ప్రశాంతత, అంతులేని సంతోషం లభిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. తనకు నచ్చిన రీతిలో, స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతున్నానని పేర్కొన్నారు.

ఈమె నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. మెజారిటీ నెటిజన్లు ఆమె ధైర్యాన్ని అభినందిస్తున్నారు. సమాజంలో హోదా, పరువు, లగ్జరీ లైఫ్ కంటే కూడా మనిషికి మనశ్శాంతి చాలా ముఖ్యమని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఐటీ ఉద్యోగులు సైతం సాఫ్ట్‌వేర్ రంగంలో తాము ఎదుర్కొంటున్న కష్టాలను ఈ సందర్భంగా పంచుకుంటున్నారు.

 

ఇది కూడా చదవండి: DK Shivakumar CM | డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి తేదీ ఖరారు

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Revanth Reddy Challenge | మోటార్లకు మీటర్లు పెడితే పోటీ చేయం..బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Challenge | తెలంగాణ రాజకీయాల్లో విద్యుత్...

Grain Procurement Issues | తెలంగాణ గొంతు కోసేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయి: ప్రశాంత్​రెడ్డి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Grain Procurement Issues | తెలంగాణ గొంతు కోసేందుకు...

DK Shivakumar CLP Leader | కర్ణాటక సీఎల్పీ లీడర్​గా డీకే శివకుమార్​

అక్షరటుడే వెబ్‌డెస్క్: DK Shivakumar CLP Leader | కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు...

Retirement Honours | ప్రభుత్వ ఉద్యోగులకు పదవీవిరమణ తప్పనిసరి: సీపీ సాయి చైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Retirement Honours | ప్రభుత్వ సర్వీస్​లో ఉన్నవారికి...