Annamalai Resignation | అన్నామలై రాజీనామాకు ఆమోదం.. కొత్త పార్టీ పెడతారా?

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Annamalai Resignation | బీజేపీ తమిళనాడు (Tamil Nadu) మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ శుక్రవారం ఆమోదించారు.

తమిళనాడు బీజేపీలో కీలకంగా పని చేసిన అన్నామలై కొంతకాలంగా పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో ఆయన ఆవేదన చెందారు. 2011 బ్యాచ్​ ఐపీఎస్​ అధికారి అయిన అన్నామలై కర్ణాటక కేడర్​లో పని చేశారు. 2019లో స్వచ్ఛంద విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం బీజేపీలో చేరి ఆ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అయితే పొత్తుల విషయంలో ఆయన మాటలను బీజేపీ అధిష్టానం పట్టించుకోలేదు. అంతేగాకుండా రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించింది. దీంతో ఇటీవల ఆయన రాజీనామా చేయగా.. తాజాగా నితిన్​ నబిన్​ ఆమోదించారు.

Annamalai Resignation | అమిత్​ షాతో భేటీ

అన్నామలై మంగళవారం పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ (Nithin Nabin)ను కలిశారు. తాము “సౌహార్దపూర్వక వాతావరణంలో” ఈ బంధాన్ని ముగించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ తర్వాత అమిత్ షా, బి.ఎల్. సంతోష్‌లతో కూడా సమావేశమయ్యారు. అనంతరం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌ను ఢిల్లీకి పిలిపించారు. మరో విడత చర్చలు మొదలయ్యాయి. అయితే రాజీనామాపై అన్నామలై వెనక్కి తగ్గకపోవడంతో పార్టీ ఆమోదించింది.

Annamalai Resignation | కొత్త పార్టీ..

Annamalai Resignation

తమిళనాడులో దశాబ్దాలుగా ద్రవిడ పార్టీలు అధికారాన్ని పంచుకున్నాయి. అయితే తొలిసారి విజయ్​ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం (TVK Government) ఏర్పడింది. ఈ క్రమంలో అక్కడ బీజేపీ బలపడే అవకాశం ఇప్పట్లో లేదని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి అన్నాడీఎంకే పని అయిపోతుందని, డీఎంకే, టీవీకే మధ్య పోరు ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంత ప్రయత్నించినా బీజేపీ క్షేత్రస్థాయిలోకి బలంగా వెళ్లలేకపోతుంది. దీంతో అన్నామలై కొత్త పార్టీ పెట్టనున్నట్లు సమాచారం.

 Annamalai Resignation | ప్రజా ఉద్యమం

Annamalai Resignation

తమిళనాడు వ్యాప్తంగా యువ నాయకులను గుర్తించి, వారికి శిక్షణ ఇచ్చి, తీర్చిదిద్దే లక్ష్యంతో ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించే ప్రణాళికలపై అన్నామలై పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ఉద్యమం భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా తమిళనాడులో బీజేపీ ఓట్ల శాతాన్ని, పార్టీ ప్రాచుర్యాన్ని పెంచిన ఘనత ఆయనకు దక్కినప్పటికీ, ఎన్నికల పరంగా ఆయనకు ఇప్పటివరకు విజయం లభించలేదు. ఆయన 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు.

ఇది కూడా చదవండి..: CMRL ED Probe | సీఎంఆర్‌ఎల్‌పై ఈడీ విచారణ.. కేరళ హైకోర్టు కీలక తీర్పు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *