Modi Trump Meeting | జీ-7 సదస్సు సందర్భంగా మోడీ-ట్రంప్ భేటీకి రంగం సిద్ధం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Modi Trump Meeting | ఫ్రాన్స్‌లో జరగనున్న జీ-7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని Narendra Modi, అమెరికా అధ్యక్షుడు Donald Trump మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది.

జూన్ 17న (స్థానిక కాలమానం ప్రకారం) ఈ భేటీ నిర్వహించనున్నట్లు అమెరికా అధికార వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

Modi Trump Meeting | గతంలో వాషింగ్టన్​లో..

ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం గత ఏడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్‌లో ఆయనను మోడీ కలిశారు. ఆ తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖిగా సమావేశం కావడం ఇదే తొలిసారి కానుంది. ఈ నేపథ్యంలో జీ-7 సదస్సు వేదికగా జరిగే భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జూన్ 16-17 తేదీల్లో నిర్వహించనున్న జీ-7 సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు Emmanuel Macron ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సరఫరా గొలుసుల భద్రత, కృత్రిమ మేధస్సు, ప్రాంతీయ భద్రతా సవాళ్లు వంటి అంశాలు సదస్సులో ప్రధాన చర్చాంశాలుగా ఉండనున్నాయి.

Modi Trump Meeting | ప్రత్యేక ఆహ్వానం..

మోడీ-ట్రంప్ సమావేశంలో భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య సంబంధాలు, రక్షణ సహకారం, ఇండో-పసిఫిక్ ప్రాంతీయ భద్రత, కీలక అంతర్జాతీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశం ఉందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. అలాగే పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకునే అవకాశముంది.

జీ-7 సభ్యదేశం కాకపోయినా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పెరుగుతున్న పాత్ర దృష్ట్యా గత కొన్ని సంవత్సరాలుగా మోడీకి ప్రత్యేక ఆహ్వానం అందుతోంది. ఈసారి కూడా ఆయన సదస్సులో పాల్గొని పలువురు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.

Bhatti Vikramarka Comments | హరీష్‌రావు అబద్ధాలరావుగా మారిపోయారు : డిప్యూటీ సీఎం భట్టి

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *