Cockroach Janata Party Protest | హైదరాబాద్​లో కాక్రోచ్​ జనతా పార్టీ ధర్నా

ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cockroach Janata Party Protest | ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నీట్ పరీక్ష (NEET Exam) పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నీట్​ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్​ జనతా పార్టీ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా పార్టీ కాక్రోచ్​ జనతా పార్టీకి యువత నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. తాజాగా హైదరాబాద్​లోని ధర్నా చౌక్​లో నిరసన చేపట్టారు. ఆందోళనలో పాల్గొనేందుకు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, సీజేపీ అధికార ప్రతినిధి విజేత దహియా సైతం రానున్నారు.

Cockroach Janata Party Protest | రాజీనామా చేయాలని డిమాండ్​

కాక్రోచ్​ జనతా పార్టీ నిరసనకు పెద్ద ఎత్తున యువత తరలి వచ్చారు. పేపర్ లీకులకు బాధ్యత తీసుకొని కేంద్ర మంత్రి ధర్మేంద ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్​ చేశారు. ‘రాజ్యాంగం జిందాబాద్’ అంటూ యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

దీనిని కూడా చదవండి : Jnaneshwari Missing Case | చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *