Sadaram Dates | సోషల్ మీడియాలో సదరం తేదీలపై ఫేక్​ ప్రచారం.. నమ్మొద్దని డీఆర్డీవో సూచన

కామారెడ్డి జిల్లా డీఆర్డీవో పేరుతో సోషల్ మీడియాలో వైరల్​ అవుతున్న సదరం క్యాంప్ తేదీలు పూర్తిగా అవాస్తవమని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది.

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Sadaram Dates | జిల్లా డీఆర్డీవో పేరుతో సోషల్ మీడియాలో వైరల్​ అవుతున్న సదరం క్యాంప్ తేదీలు పూర్తిగా అవాస్తవమని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (DRDO Kamareddy) ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేసింది.

Sadaram Dates | జిల్లా ఆస్పత్రిలో..

జిల్లా ఆస్పత్రిలో జూన్ 14, 15, 21, 22 తేదీల్లో సదరం క్యాంప్​లు (Sadaram camps) జరుగుతాయని వైరల్​ అవుతున్న పోస్టర్ అధికారికమైనది కాదని డీఆర్డీవో స్పష్టం చేశారు. ఈ తప్పుడు సమాచారాన్ని నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. సదరం క్యాంప్​లకు సంబంధించిన అధికారిక సమాచారం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ మొబైల్ నంబరుకు మాత్రమే మెసేజ్ ద్వారా లేదా నేరుగా ఫోన్ కాల్ ద్వారా తెలియ చేస్తామని తెలిపారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని సృష్టించి ప్రచారం చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా ప్రజలు నేరుగా జిల్లా డీఆర్డీఏ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.

sadram

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *