International Yoga Day 2026 | “కోల్‌కతాలో యోగా దినోత్సవ వేడుకలు.. పాల్గొననున్న ప్రధాని మోదీ

ప్రతి సంవత్సరం జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కోల్‌కతాలో భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: International Yoga Day 2026 | ప్రతి సంవత్సరం జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కోల్‌కతాలో భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్‌రావ్‌ జాదవ్‌ వెల్లడించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) హాజరై, యోగాసనాలు వేయనున్నారు.

International Yoga Day 2026 | ఈ సంవత్సరం థీమ్..

‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్’ (Yoga for Healthy Ageing) అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. యోగా ప్రాముఖ్యతను గుర్తించిన లక్షలాది మంది ప్రజలు దీనిని తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకున్నారని జాదవ్ పేర్కొన్నారు.

International Yoga Day 2026 | అంతర్జాతీయ స్థాయిలో వేడుకలు..

‘ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్’ సహకారంతో, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు 210కి పైగా దేశాల్లో సుమారు 2,500 ప్రదేశాలలో యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. యోగా ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది.

ఇది కూడా చదవండి:  Prajavani Complaints | ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *