Urea App Cancellation | యూరియా యాప్​ను రద్దు చేయాల్సిందే..

తమకు ఇబ్బందికరంగా మారిన యూరియా యాప్​ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు భిక్కనూరులో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Urea App Cancellation | తమకు ఇబ్బందికరంగా మారిన యూరియా యాప్​ను రద్దు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు. బుధవారం భిక్కనూరు మండల (Bikhnoor Mandal) కేంద్రంలో సుమారు గంటపాటు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు.

Urea App Cancellation | యూరియా తీసుకునేందుకు ఇబ్బందులు..

యూరియా సరఫరాతో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు ఏకరువు పెట్టారు. భిక్కనూరు సొసైటీలో 4వేల బస్తాలు వస్తే యాప్​లో నిమిషాల్లో ఎలా మాయం అవుతున్నాయో అధికారులు చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు. స్మార్ట్ ఫోన్ అంటే ఏమిటో తెలియని రైతులు యూరియా ఎలా బుక్ చేసుకుంటారని ప్రశ్నించారు. యూరియా బుకింగ్ కోసం ఇతరులను బతిమాలుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న యాప్​ను రద్దు చేసి గతంలో మాదిరిగా నేరుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఏడీఏ అపర్ణ రైతులకు నచ్చజెప్పారు. సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తామని, యూరియా సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.Urea App Cancellation

ఇది కూడా చదవండి..: Government Schools | ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *