Monalisa Bhosle Protection | కుంభమేళా మోనాలిసాకు ఊరట.. హైకోర్టు కీలక తీర్పు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Monalisa Bhosle Protection |  కుంభమేళా వీడియోతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మోనాలిసా భోస్లేకు కేరళ హైకోర్టు ( Kerala High Court) రక్షణ కల్పించింది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని, భద్రత కల్పించాలంటూ ఆమె తన భర్తతో కలిసి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఆమెకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది.

Monalisa Bhosle Protection | మైనర్ అంటూ ఫిర్యాదు..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా, తన ప్రియుడు ఫర్మాన్‌ ఖాన్‌ను ఈ సంవత్సరం మార్చిలో కేరళలో వివాహం చేసుకుంది. అయితే, తమ కూతురు మైనర్ అని, ఆమెను ఫర్మాన్ అపహరించుకుపోయాడంటూ మోనాలిసా తండ్రి మధ్యప్రదేశ్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఫర్మాన్‌పై కిడ్నాప్ , పోక్సో కేసులు నమోదయ్యాయి.

Monalisa Bhosle Protection | కోర్టులో పిటిషన్..

మధ్యప్రదేశ్‌లో తమకు ప్రాణహాని ఉందని, అందుకే పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు రక్షణ కల్పించాలని దంపతులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, ఎర్నాకుళం సెంట్రల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను మోనాలిసాకు తగిన రక్షణ కల్పించాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను జులై 10కి వాయిదా వేసింది.

Monalisa Bhosle Protection | వయసుపై స్పష్టత..

మోనాలిసా మైనర్ అన్న ఆమె తల్లిదండ్రుల ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. ఆమె సమర్పించిన బర్త్‌ సర్టిఫికెట్, ఓటర్ కార్డు , బ్యాంకు పాస్‌బుక్‌లను పరిశీలించిన న్యాయస్థానం, అందులో పుట్టిన తేదీ 2008 జనవరి 1గా ఉందని పేర్కొంది. ఈ ఆధారాల ప్రకారం ఆమె మేజర్‌గా భావించబడుతుందని కోర్టు స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Gundla Singaram Eviction | పేదల గుడిసెల తొలగింపు.. హన్మకొండ గుండ్లసింగారంలో ఉద్రిక్తత

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *